
Updated : 27 Jan 2022 07:24 IST
Janhvi Kapoor: జాన్వీ క్రికెట్ ప్రాక్టీస్
బాలీవుడ్ యువ కథా నాయిక, శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ కొత్త చిత్రం కోసం కష్టపడుతోంది. ఆమె రాజ్‌కుమార్ రావ్‌తో కలిసి నటిస్తున్న చిత్రం ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’. క్రికెట్ నేపథ్యంగా సాగే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కనుంది. శరణ్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కరణ్‌జోహార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మహేంద్రగా రాజ్‌కుమార్, మహిమగా జాన్వీ పాత్రలు ఉండనున్నాయి. ఈ చిత్రంలోని తన పాత్ర కోసం క్రికెట్ ప్రాక్టీస్ మొదలు పెట్టింది జాన్వీ. ఈ సందర్భంగా ప్రాక్టీస్‌కు సంబంధించిన ఫొటోలను పంచుకుంది. ఈ సినిమాని ఈ ఏడాది అక్టోబరు 7న థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Tags :