టైగర్‌ వర్సెస్‌ పఠాన్‌?

అగ్ర హీరోలు షారూక్‌ ఖాన్‌, సల్మాన్‌ఖాన్‌ కథానాయకులుగా ఓ భారీ యాక్షన్‌ చిత్రం రూపొందనుందా? ఈ ఇద్దరూ చేస్తున్న సూపర్‌ హీరోల పాత్రల మేళవింపుగా ఆ సినిమా తెరకెక్కనుందా? అవుననే అంటున్నాయి హిందీ పరిశ్రమ వర్గాలు

Published : 05 Jul 2022 00:55 IST

అగ్ర హీరోలు షారూక్‌ ఖాన్‌, సల్మాన్‌ఖాన్‌ కథానాయకులుగా ఓ భారీ యాక్షన్‌ చిత్రం రూపొందనుందా? ఈ ఇద్దరూ చేస్తున్న సూపర్‌ హీరోల పాత్రల మేళవింపుగా ఆ సినిమా తెరకెక్కనుందా? అవుననే అంటున్నాయి హిందీ పరిశ్రమ వర్గాలు. బాలీవుడ్‌లో టైగర్‌ అనగానే సల్మాన్‌ఖాన్‌ గుర్తొస్తారు. ఆయన చేసిన ‘టైగర్‌ జిందా హై’, ‘ఏక్‌ థా టైగర్‌’ సినిమాల ప్రభావమే అది. ‘పఠాన్‌’గా వచ్చే యేడాది షారూక్‌ ఖాన్‌ సందడి చేయనున్నారు. ‘టైగర్‌3’ సినిమాలోనూ షారూక్‌ఖాన్‌   పఠాన్‌గా ఓ అతిథి పాత్ర చేయనున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరూ చేస్తున్న టైగర్‌, పఠాన్‌ పాత్రల్ని కలిపి ఓ భారీ యాక్షన్‌ చిత్రం చేయాలనేది యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ అధినేత ఆదిత్యచోప్రా ఆలోచన. ఆ దిశగా ఆయన కథనీ సిద్ధం చేశారనేది బాలీవుడ్‌ వర్గాల సమాచారం. టైగర్‌ వర్సెస్‌ పఠాన్‌గా రూపొందే అవకాశాలున్నాయనేది బాలీవుడ్‌ వర్గాల సమాచారం. అదేగనక నిజమైతే 1995లో వచ్చిన ‘కరణ్‌ అర్జున్‌’ తర్వాత షారూక్‌, సల్మాన్‌ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్‌ సినిమా ఇదే అవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని