పద్నాలుగేళ్ల లాల్‌సింగ్‌ ఛద్ధా

అదేంటి? సినిమా ఇంకా విడుదల కాకముందే ‘లాల్‌సింగ్‌ ఛద్ధా’కి పద్నాలుగేళ్లు ఏంటని ఆశ్చర్యపోతున్నారు కదూ!  ఔను.. ఈ చిత్ర ఆలోచన ఊపిరి పోసుకుంది పద్నాలుగేళ్ల కిందటే. జులై 4, 2008లోనే అబ్బాస్‌ టైర్‌వాలా తెరకెక్కించిన

Published : 05 Jul 2022 00:59 IST

అదేంటి? సినిమా ఇంకా విడుదల కాకముందే ‘లాల్‌సింగ్‌ ఛద్ధా’కి పద్నాలుగేళ్లు ఏంటని ఆశ్చర్యపోతున్నారు కదూ!  ఔను.. ఈ చిత్ర ఆలోచన ఊపిరి పోసుకుంది పద్నాలుగేళ్ల కిందటే. జులై 4, 2008లోనే అబ్బాస్‌ టైర్‌వాలా తెరకెక్కించిన ‘జానే తూ.. యా జానే నా?’ విడుదలైంది. దీన్ని ఆమిర్‌ఖాన్‌ నిర్మించారు. ఆ సినిమా ప్రీమియర్‌ రోజున ఆమిర్‌, అతుల్‌కులకర్ణి పిచ్చాపాటీగా మాట్లాడుకున్నారు. ఈ చర్చల్లోంచి లాల్‌సింగ్‌ ఛద్ధా కథ రాసేలా అతుల్‌లో స్ఫూర్తి నింపారు ఆమిర్‌. తర్వాత హాలీవుడ్‌ సూపర్‌హిట్‌ చిత్రం ‘ఫారెస్ట్‌ గంప్‌’ ఆధారంగా ఈ కథ సిద్ధం చేశారు. కానీ హాలీవుడ్‌ చిత్ర హక్కుల కోసం ఆమిర్‌ఖాన్‌ ప్రొడక్షన్స్‌ ఎనిమిదేళ్లు నిరీక్షించాల్సి వచ్చింది. అద్వైత్‌ చవాన్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కరీనాకపూర్‌ ఖాన్‌ కథానాయికగా నటిస్తోంది. నాగచైతన్య కీలక పాత్ర పోషించారు. ఆగస్టు 11న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని