ఎవరూ స్టార్‌లు కాదు... అందరూ నటులే

‘‘స్టార్‌ పవర్‌ ఆధారంగా సినిమాలు చేసే యుగం పోయింది’’ అంటోంది ప్రముఖ కథానాయిక కరీనా కపూర్‌. ఓ సినిమా భవిష్యత్తును నిర్ణయించేది కథేనని.. దీన్ని గుర్తించి నటీనటులంతా మంచి కథలు ఎంచుకోవడంపై దృష్టి సారించాలని హితవు పలికింది. 

Published : 30 Jul 2022 02:42 IST

‘‘స్టార్‌ పవర్‌ ఆధారంగా సినిమాలు చేసే యుగం పోయింది’’ అంటోంది ప్రముఖ కథానాయిక కరీనా కపూర్‌. ఓ సినిమా భవిష్యత్తును నిర్ణయించేది కథేనని.. దీన్ని గుర్తించి నటీనటులంతా మంచి కథలు ఎంచుకోవడంపై దృష్టి సారించాలని హితవు పలికింది.  ‘‘కొవిడ్‌ పరిస్థితుల వల్ల ప్రజల అభిరుచుల్లో చాలా మార్పులొచ్చాయి. వారిప్పుడు మంచి కంటెంట్‌ను చూడాలనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ స్టార్‌డమ్‌పై ఆధారపడే సినిమాలు చేస్తామంటే కుదరదు. ఆ రోజులు పోయాయి. కథే సినిమా భవిష్యత్తును నిర్దేశిస్తోంది. కాబట్టి మంచి కథలు రాయడం పైనా.. చదవడం పైనా అందరం దృష్టి పెడదాం. నా అభిప్రాయం ప్రకారం ఈ రోజున స్టార్లంటూ ప్రత్యేకంగా ఎవరూ లేరు. అందరూ నటులే’’ అని కరీనా చెప్పింది. ప్రస్తుతం ఓటీటీ వేదికల వల్ల ప్రేక్షకులు కాస్త థియేటర్లకు దూరమైనప్పటికీ.. మంచి సినిమా కచ్చితంగా వారందరినీ థియేటర్లకు రప్పిస్తుందని తెలిపింది. ప్రస్తుతం ఆమె నటించిన ‘లాల్‌సింగ్‌ చడ్ఢా’విడుదలకు సిద్ధంగా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని