Movies: ఇక ‘సత్యప్రేమ్‌ కి కథ’

కార్తీక్‌ ఆర్యన్‌, కియారా అడ్వాణీ జంటగా సమీర్‌ విద్వాన్స్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘సత్యనారాయణ్‌ కీ కథ’. ఈ టైటిల్‌ను ‘సత్యప్రేమ్‌ కి కథ’గా మార్చుతున్నట్టు సినీవర్గాలు సోమవారం ప్రకటించాయి. ‘ఇతరుల మనోభావాలను కించపరిచే ఉద్దేశం మాకు ఏమాత్రం లేకపోయినా.. ఎవరి మనసులు గాయపడొద్దని భావించడంతో టైటిల్‌ పేరు మార్చుతున్నాం.

Published : 02 Aug 2022 05:53 IST

కార్తీక్‌ ఆర్యన్‌, కియారా అడ్వాణీ జంటగా సమీర్‌ విద్వాన్స్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘సత్యనారాయణ్‌ కీ కథ’. ఈ టైటిల్‌ను ‘సత్యప్రేమ్‌ కి కథ’గా మార్చుతున్నట్టు సినీవర్గాలు సోమవారం ప్రకటించాయి. ‘ఇతరుల మనోభావాలను కించపరిచే ఉద్దేశం మాకు ఏమాత్రం లేకపోయినా.. ఎవరి మనసులు గాయపడొద్దని భావించడంతో టైటిల్‌ పేరు మార్చుతున్నాం. త్వరలోనే ఏకధాటిగా షూటింగ్‌ మొదలవుతుంది’ అంటూ దర్శకుడు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర ఫస్ట్‌లుక్‌ సైతం విడుదల చేశారు. ఇందులో నాయకానాయికలు ఎదురెదురుగా నిల్చొని తన్మయత్వంతో ఒకరి భుజాలపై ఒకరు చేతులు వేసుకుని ఉన్నారు. ఈ సినిమాలో కార్తీక్‌ ఆర్యన్‌ ‘సత్యప్రేమ్‌’ పాత్ర పోషిస్తుంటే కియారా ‘కథ’గా నటిస్తుంది. ఈ లుక్‌ పోస్టర్‌ని కార్తీక్‌ ఆర్యన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ ‘హ్యాపీ బర్త్‌డే కథా’ అంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని