నటుడు మితిలేశ్ చతుర్వేది కన్నుమూత
ప్రముఖ హిందీ నటుడు... ‘గదర్: ఏక్ ప్రేమ్‌కథ’, ‘కోయి మిల్ గయా’, ‘రెడీ’ తదితర చిత్రాలతో ప్రేక్షకులకు గుర్తుండిపోయిన మితిలేశ్ చతుర్వేది(67) కన్నుమూశారు. పది రోజుల కిందట గుండెపోటుకి గురైన ఆయన ముంబయిలోని ఓ ఆస్పత్రిలో చేరారు.
ప్రముఖ హిందీ నటుడు... ‘గదర్: ఏక్ ప్రేమ్‌కథ’, ‘కోయి మిల్ గయా’, ‘రెడీ’ తదితర చిత్రాలతో ప్రేక్షకులకు గుర్తుండిపోయిన మితిలేశ్ చతుర్వేది(67) కన్నుమూశారు. పది రోజుల కిందట గుండెపోటుకి గురైన ఆయన ముంబయిలోని ఓ ఆస్పత్రిలో చేరారు. శ్వాసకోశ సమస్యలతోనూ బాధపడుతున్న ఆయన గురువారం ముంబయిలోని ఆస్పత్రిలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్టు చతుర్వేది కుటుంబ సభ్యులు వెల్లడించారు. సహాయ పాత్రలతో హిందీ సినిమాపై తనదైన ముద్రవేసిన నటుడాయన. ‘తాల్’, ‘ఫిజా’, ‘అశోక’, ‘బంటీ ఔర్ బబ్లీ’, ‘క్రిష్’, ‘గులాబో సితాబో’ చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు విశేష ఆదరణ పొందాయి. ‘స్కామ్ 1992: ద హర్షద్ మెహతా స్టోరి’ అనే వెబ్‌సిరీస్‌లోనూ నటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
MK Stalin: ప్రజల పట్ల మర్యాదతో ప్రవర్తించండి.. ఉద్యోగులకు సీఎం స్టాలిన్ విజ్ఞప్తి
-
Asteroid : బెన్ను నమూనాల గుట్టు విప్పుతున్నారు.. అక్టోబరు 11న లైవ్ స్ట్రీమింగ్!
-
Tamannaah: అలాంటి సీన్స్‌లో నటించడం మానేశా: దక్షిణాది చిత్రాలపై తమన్నా వ్యాఖ్యలు
-
stuntman sri badri: ‘భోళా శంకర్’ మూవీ పారితోషికాన్ని విరాళంగా ఇచ్చిన స్టంట్‌మ్యాన్ శ్రీబద్రి
-
Hyderabad: చింతల్‌బస్తీ నాలాలో మొసలి పిల్ల.. భయాందోళనలో స్థానికులు
-
Guntur: తెదేపా మహిళా నేత అరెస్టు.. పోలీసుల తీరును తప్పుబట్టిన న్యాయమూర్తి