Updated : 08 Aug 2022 03:51 IST

Cinema news: కెమెరా ముందుకు... మాలాశ్రీ వారసురాలు

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటి... మాలాశ్రీ. కథానాయికగా పలు విజయవంతమైన చిత్రాల్లో మెరిశారామె. ఇప్పుడు ఆమె కుమార్తె రాధనా రామ్‌ కెమెరా ముందుకొచ్చింది. తరుణ్‌ సుధీర దర్శకత్వంలో దర్శన్‌ కథానాయకుడిగా ఇటీవల బెంగళూరులో ‘డి56’ పేరుతో ఓ చిత్రం మొదలైంది. రాక్‌లైన్‌ వెంకటేశ్‌ నిర్మిస్తున్న ఈ సినిమాతోనే ప్రముఖ నిర్మాత రాము, నటి మాలాశ్రీ కుమార్తె రాధనా రామ్‌ కథానాయికగా పరిచయమవుతోంది. ముంబయిలో నటన, డ్యాన్స్‌లో శిక్షణ తీసుకున్న రాధనా సినీ రంగ ప్రవేశంపై మాలాశ్రీ సంతోషం వ్యక్తం చేశారు.


‘పూర్ణ’ చిత్రం ప్రారంభం

వరుణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘పూర్ణ’. సోనాక్షి వర్మ, చైతన్య ప్రియ కథానాయికలు. యం.ఆర్‌.దీపక్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ప్రేమ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆదివారం ప్రారంభమైంది. నాయకానాయికలపై తెరకెక్కించిన ముహూర్తం సన్నివేశానికి నిర్మాత సి.కల్యాణ్‌ క్లాప్‌నిచ్చారు. నిర్మాతల మండలి కార్యదర్శి టి.ప్రసన్నకుమార్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ గౌరవ దర్శకత్వం వహించారు. కథానాయకుడు వరుణ్‌ మాట్లాడుతూ ‘‘భయం అంటే తెలియని పూర్ణ అనే కుర్రాడు... అనుక్షణం భయపడుతూ ఉండే ఓ అమ్మాయికి ఎలా ధైర్యం నూరిపోశాడనేది ఈ కథలో ఆసక్తికరం’’ అన్నారు. ‘‘నేటి తరానికి కనెక్ట్‌ అయ్యే కథ ఇది’’ అన్నారు కథానాయిక సోనాక్షి వర్మ. ‘‘నేటి సమాజంలో అమ్మాయిలపై అనేక ఆకృత్యాలు జరుగుతున్నాయి. వాటి నుంచి అమ్మాయిలు తమని తాము ఎలా కాపాడుకోవాలో ఈ చిత్రంతో చెబుతున్నాం’’ అన్నారు దర్శకుడు. ఈ కార్యక్రమంలో  నిర్మాతలు మోహన్‌ వడ్లపట్ల, అనుపమ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని