Amitabh Bachchan: స్నేహ ప్రయాణం

‘ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో’ తర్వాత సూరజ్‌ బర్జాత్య దర్శకత్వం వహించిన చిత్రం ‘ఉంచై’. అమితాబ్‌ బచ్చన్‌ ప్రధాన పాత్రధారిగా  నటించారు. రాజ్‌శ్రీ ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది నవంబర్‌ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు.

Updated : 08 Aug 2022 03:49 IST

‘ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో’ తర్వాత సూరజ్‌ బర్జాత్య దర్శకత్వం వహించిన చిత్రం ‘ఉంచై’. అమితాబ్‌ బచ్చన్‌ ప్రధాన పాత్రధారిగా  నటించారు. రాజ్‌శ్రీ ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది నవంబర్‌ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. అమితాబ్‌ బచ్చన్‌ తన ట్విటర్‌ ద్వారా ఈ లుక్‌ని పంచుకుంటూ... ‘స్నేహాన్ని సంబరంగా జరుపుకొన్న ప్రయాణం’ ఇది అనే వ్యాఖ్యని జోడించారు. స్నేహం మాత్రమే వారి ప్రేరణ అని రాసున్న పోస్టర్‌లో ముగ్గురు వ్యక్తులు మంచు కొండల్లో ప్రయాణం చేస్తూ కనిపిస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్‌తోపాటు... అనుపమ్‌ ఖేర్‌, బొమన్‌ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పోస్టర్‌ని బట్టి ఇది స్నేహితుల ప్రయాణం నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది.
 

మరో రీమేక్‌?
కొన్నాళ్లుగా రీమేక్‌ కథలతోనే ప్రయాణిస్తూ వస్తున్నారు బాలీవుడ్‌ కథానాయకుడు షాహిద్‌ కపూర్‌. ‘అర్జున్‌ రెడ్డి’ రీమేకైన ‘కబీర్‌ సింగ్‌’తో భారీ విజయాన్ని అందుకున్న ఆయన.. ‘జెర్సీ’ రీమేక్‌తో చేదు ఫలితాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఆయన అలీ అబ్బాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇది ‘నూట్‌ బ్లాంచే’ అనే ఫ్రెంచ్‌ చిత్రానికి రీమేక్‌గా రూపొందుతోంది. ఇది పూర్తయిన వెంటనే ఆయన మలయాళ థ్రిల్లర్‌ ‘ముంబయి పోలీస్‌’ రీమేక్‌ కోసం రంగంలోకి దిగనున్నారని సమాచారం. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, జయసూర్య, రెహమాన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమిది. మాతృకను తెరకెక్కించిన రోషన్‌ ఆండ్రూస్‌ ఈ హిందీ సినిమాకీ దర్శకత్వం వహించనున్నారు. రాయ్‌ కపూర్‌ ఫిల్మ్స్‌ నిర్మించనుంది. ఈ చిత్రంలో మరో ప్రధాన పాత్ర కోసం ఓ దక్షిణాది నటుడ్ని సంప్రదిస్తున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని