మళ్లీ టైగర్‌కి జంటగా..

అక్షయ్‌కుమార్‌, టైగర్‌ష్రాఫ్‌ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘బడేమియా ఛోటేమియా’. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకుడు.

Published : 17 Aug 2022 02:37 IST

అక్షయ్‌కుమార్‌, టైగర్‌ష్రాఫ్‌ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘బడేమియా ఛోటేమియా’. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకుడు. ఇప్పటికే విడుదలైన యాక్షన్‌ ప్రోమో ఆకట్టుకుంటోంది. ఇందులో నటించే కథానాయికలు ఎవరన్నది సస్పెన్స్‌గా ఉంచారు. ఈ ఊహాగానాలకు దర్శకుడు మంగళవారం తెర దించారు. ఇందులో టైగర్‌ష్రాఫ్‌కి జోడీగా శ్రద్ధా కపూర్‌ నటించనున్నట్టు అలీ అబ్బాస్‌ ప్రకటించారు. గతంలో వీళ్లిద్దరూ ‘భాఘీ’, ‘భాఘీ 3’లలో కలిసి నటించారు. మూడోసారి జోడీగా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మొదలై, క్రిస్మస్‌కి విడుదల చేస్తామని గతంలోనే ప్రకటించారు. 1998లో అమితాబ్‌ బచ్చన్‌, గోవింద్‌ కథానాయకులుగా ఇదే పేరుతో వచ్చిన చిత్రానికి ఇది రీబూట్‌ వెర్షన్‌.


ఆత్మ సాక్షిగా ‘అదల్‌ బదల్‌’

సిద్ధార్థ్‌ మల్హోత్రా, కియారా అడ్వాణీ మరోసారి తెరపై రొమాన్స్‌ చేయనున్నారు. వీళ్లిద్దరూ కలిసి గతంలో ‘షేర్‌షా’లో నటించారు. ఈ కెమిస్ట్రీకి మంచి మార్కులే పడ్డాయి. ‘ఈ ఇద్దరి కలయికలో మరో ప్రేమకథా చిత్రం తెరకెక్కనుంది. ఒక
మార్మికమైన పరిస్థితులలో రెండు ఆత్మలు పరస్పర మార్పిడికి గురవుతాయి. తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నం అయ్యాయి అన్నది తెరపైనే చూడాలి. దీనికి ‘అదల్‌ బదల్‌’ అనే టైటిల్‌ ఖరారు చేశాం. ఇలాంటి కథాంశంతో ఇదివరకెప్పుడూ సినిమా రాలేదు. ఈ రొమాంటిక్‌ కామెడీలో గ్రాఫిక్స్‌కి అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఈ ప్రాజెక్టుపై సిద్‌, కియారాలిద్దరూ ఎంతో ఆసక్తిగా ఉన్నారు’ అంటూ సినీవర్గాలు తాజాగా ప్రకటించాయి. సునీల్‌ ఖేత్రపాల్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ఫ్లోర్స్‌లోకి వెళ్తున్నట్టు తెలుస్తోంది. సిద్ధార్థ్‌ ప్రస్తుతం ‘ఇండియన్‌ పోలీస్‌ ఫోర్స్‌’తో బిజీగా ఉండగా.. కియారా రామ్‌చరణ్‌ 15వ చిత్రంలో నటిస్తున్నారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts