స్క్రిప్ట్‌వర్క్‌లో.. ‘ది డర్టీ పిక్చర్‌ 2’

తెలుగు నటి సిల్క్‌ స్మిత జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ది డర్టీ పిక్చర్‌’. విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాదు.. బాక్సాఫీసు దగ్గర భారీ కలెక్షన్లు సాధించిందీ సినిమా.

Published : 17 Aug 2022 02:37 IST

తెలుగు నటి సిల్క్‌ స్మిత జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ది డర్టీ పిక్చర్‌’. విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాదు.. బాక్సాఫీసు దగ్గర భారీ కలెక్షన్లు సాధించిందీ సినిమా. దశాబ్దం తర్వాత దీనికి సీక్వెల్‌ రూపొందించే పనిలో పడ్డాయి సినీవర్గాలు. అందుకు సంబంధించి స్క్రిప్ట్‌ వర్క్‌ సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. సిల్క్‌ స్మిత బాల్యం, యవ్వనం రోజుల నాటి సంఘటనల ఆధారంగా ఈ రెండోభాగం తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. ఇందులో విద్యాబాలన్‌ నటించేది అనుమానంగానే ఉంది. 2011లో వచ్చిన ‘ది డర్టీ పిక్చర్‌’ వందకోట్లకు పైగా వసూళ్లు సాధించింది. విద్యాబాలన్‌తోపాటు ఇమ్రాన్‌ హష్మీ, నసీరుద్దీన్‌ షా, తుషార్‌కపూర్‌లు కీలకపాత్రల్లో నటించారు. ఎక్తా కపూర్‌, శోభా కపూర్‌లు నిర్మించిన ఈ చిత్రానికి మిలన్‌ లూత్రియా దర్శకుడు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts