Bollywood: అలా... ప్రకృతి అందాల్లో...!

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ నుంచి వస్తున్న తాజా చిత్రం ‘భాయిజాన్‌’. ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం లడఖ్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా సల్మాన్‌ ఖాన్‌ ఈ చిత్రంలో తన కొత్త లుక్‌ను తన ఇన్‌స్టాలో పంచుకున్నాడు. లాంగ్‌ హెయిర్‌తో, కళ్లజోడు పెట్టుకొని, మోటర్‌సైకిల్‌ పక్కన నిలబడి దూరంగా ఉన్న ప్రకృతి అందాలు పరిశీలిస్తున్నట్లు

Updated : 20 Aug 2022 09:32 IST

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ (Salman Khan) నుంచి వస్తున్న తాజా చిత్రం ‘భాయిజాన్‌’ (Bhaijaan). ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం లడఖ్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా సల్మాన్‌ ఖాన్‌ ఈ చిత్రంలో తన కొత్త లుక్‌ను తన ఇన్‌స్టాలో పంచుకున్నాడు. లాంగ్‌ హెయిర్‌తో, కళ్లజోడు పెట్టుకొని, మోటర్‌సైకిల్‌ పక్కన నిలబడి దూరంగా ఉన్న ప్రకృతి అందాలు పరిశీలిస్తున్నట్లు ఉన్న ఈ చిత్రం అభిమానులను అలరిస్తోంది. ఈ చిత్రంలో తెలుగు కథానాయకుడు వెంకటేష్‌ ఓ ముఖ్యపాత్రలో మెరవనున్నారు. సల్మాన్‌ వరుసగా ‘కిక్‌-2’, ‘టైగర్‌-3’ సినిమాలు చేస్తున్నారు.


మరోసారి పోలీసు పాత్రలో అక్షయ్‌

యాపజయాలతో సంబంధం లేకుండా బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు అక్షయ్‌కుమార్‌(Akshay Kumar) వరుస ప్రాజెక్టులతో దూసుకెళ్తున్నాడు. పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మించే ‘కట్‌పత్లీ’ (cuttputlli) అనే కొత్త చిత్రానికి సంతకం చేశాడు. ఇందులో ఆయనకి జోడీగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌ నటించనుంది. దీనికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌, గ్లింప్స్‌ను సినీవర్గాలు శుక్రవారం విడుదల చేశాయి. ఇందులో అక్షయ్‌ మరోసారి పోలీసు పాత్రలో నటిస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఆయన తన బృందంతో కలిసి ఒక వరుస హత్యల హంతకుడిని వెంటాడుతున్నట్టు ఆ వీడియోలో చూపించారు. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ డిస్నీహాట్‌స్టార్‌లో సెప్టెంబరు 2న విడుదల కానుంది. రంజిత్‌ ఎం.తివారి తెరకెక్కిస్తున్నారు. అక్షయ్‌ నటించిన ‘రక్షాబంధన్‌’ ఇటీవలే విడుదలైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని