లండన్‌లో మేరీ పత్నీ

ఓ చిత్రం సెట్స్‌పైనే ఉంది...ఇంతలోనే మరో చితాన్ని పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు బాలీవుడ్‌ నటులు అర్జున్‌కపూర్‌, భూమి పెడ్నేకర్‌. ఈ ఇద్దరూ కలిసి ‘లేడీ కిల్లర్‌’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పుడు తాజాగా మరో  చిత్రం చేస్తున్నారు. దీని షూటింగ్‌ లండన్‌లో

Published : 13 Sep 2022 03:24 IST

చిత్రం సెట్స్‌పైనే ఉంది...ఇంతలోనే మరో చితాన్ని పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు బాలీవుడ్‌ నటులు అర్జున్‌కపూర్‌, భూమి పెడ్నేకర్‌. ఈ ఇద్దరూ కలిసి ‘లేడీ కిల్లర్‌’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పుడు తాజాగా మరో  చిత్రం చేస్తున్నారు. దీని షూటింగ్‌ లండన్‌లో మొదలైంది. అక్కడే ఓ నెల రోజుల పాటు చిత్రీకరణ చేయడానికి సన్నాహాలు చేస్తోంది చిత్రబృందం. రొమాంటిక్‌ కామెడీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి ముదాస్సార్‌ అజీజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ‘పతీ పత్నీ ఔర్‌ ఓ’ చిత్రం తర్వాత ముదాస్సార్‌ దర్శకత్వంలో భూమి నటిస్తున్న రెండో చిత్రమిది.‘మేరీ పత్నీకా రీమేక్‌’  అనే పేరు అనుకుంటున్నారు.


జోరుగా... ‘యోధ’  

‘షేర్షా’లో ఆర్మీ జవాన్‌గా గత ఏడాది అందర్నీ అలరించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు సిద్ధార్థ్‌ మల్హోత్ర. ఇప్పుడు మరోసారి సైనికుడి పాత్రలో సందడి చేయనున్న చిత్రం ‘యోధ’. తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ చిత్రీకరణ మనాలీలో మొదలైంది. 1990ల్లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. యాక్షన్‌ దిథ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి సాగర్‌ అంబ్రే, పుష్కర్‌ ఓజా దర్శకత్వం వహిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్‌పై కరణ్‌ జోహార్‌ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సినిమాని విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని