నాలుగోసారి... యాక్షన్‌పై గురి

సల్మాన్‌ఖాన్‌... అలీ అబ్బాస్‌ జాఫర్‌లాది సక్సెఫుల్‌ కాంబినేషన్‌. ఈ ఇద్దరి కలయికలో ‘సుల్తాన్‌’, ‘టైగర్‌ జిందా హై’, ‘భారత్‌’ చిత్రాలొచ్చాయి. ఇప్పుడు మరో చిత్రం కోసం కథ సిద్ధం చేశారు అలీ అబ్బాస్‌. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.

Published : 16 Sep 2022 02:16 IST

ల్మాన్‌ఖాన్‌... అలీ అబ్బాస్‌ జాఫర్‌లాది సక్సెఫుల్‌ కాంబినేషన్‌. ఈ ఇద్దరి కలయికలో ‘సుల్తాన్‌’, ‘టైగర్‌ జిందా హై’, ‘భారత్‌’ చిత్రాలొచ్చాయి. ఇప్పుడు మరో చిత్రం కోసం కథ సిద్ధం చేశారు అలీ అబ్బాస్‌. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘సల్మాన్‌సార్‌తో భారీ బడ్జెట్‌తో సినిమా చేయబోతున్నాను. పక్కా యాక్షన్‌ అంశాలతో ఈ చిత్రం సాగుతుంది. త్వరలోనే ఆయనకు పూర్తిస్థాయి కథ వినిపించబోతున్నాను’’అని చెప్పారు. ఆయన దర్శకత్వం వహించిన నెట్‌ఫ్లిక్స్‌ చిత్రం ‘జోగి’ విడుదలకు సిద్ధంగా ఉంది. అక్షయ్‌కుమార్‌, టైగర్‌ష్రాఫ్‌లతో ‘బడేమియా ఛోటేమియా’, కత్రినాకైఫ్‌ ప్రధాన పాత్రలో ‘సోల్జర్‌’, షాహిద్‌కపూర్‌తో ఓ సినిమా...అలీ అబ్బాస్‌ చేతిలో ప్రస్తుతం ఉన్న చిత్రాలివి. ఇవి పూర్తయ్యాకా...సల్మాన్‌తో సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని