రెండో డ్రీమ్‌గర్ల్‌ ముస్తాబు

డ్రీమ్‌ గర్ల్‌..తక్కువ ప్రచారంతో ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయం అందుకున్న చిత్రం. నిర్మాతలకు మంచి లాభాలు అందించింది. ఆయుష్మాన్‌ ఖురానా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి సీక్వెల్‌ సిద్ధమవుతోంది. 

Published : 17 Sep 2022 01:16 IST

డ్రీమ్‌ గర్ల్‌..తక్కువ ప్రచారంతో ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయం అందుకున్న చిత్రం. నిర్మాతలకు మంచి లాభాలు అందించింది. ఆయుష్మాన్‌ ఖురానా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి సీక్వెల్‌ సిద్ధమవుతోంది.  అనన్యా పాండే నాయికగా నటిస్తోంది. ఈ సినిమాని వచ్చే ఏడాది ఈద్‌ కానుకగా జూన్‌ 29న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ముంబయిలో ఈ సినిమా కోసం ప్రత్యేకంగా సెట్‌ను తీర్చిదిద్దారు. రాజ్‌ శాండిల్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ఏక్తాకపూర్‌ నిర్మిస్తున్నారు. తొలి చిత్రానికి మించిన వినోదంతో ఈ సీక్వెల్‌ ఉండబోతుంది అని చిత్రవర్గాలు చెబుతున్నాయి.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని