అభిమానుల ముందుకు.. సల్మాన్‌ జీవితం

సల్మాన్‌ అభిమానులందరికీ శుభవార్త. ఈ కండల వీరుడికి సంబంధించిన అరుదైన సమాచారంతో ఓ డాక్యుమెంటరీ-బయోపిక్‌ తెరకెక్కనుంది. ‘బియాండ్‌ ది స్టార్‌’ పేరుతో అప్లాజ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అనే సంస్థ దీన్ని నిర్మించనుంది.

Published : 20 Sep 2022 04:57 IST

ల్మాన్‌ అభిమానులందరికీ శుభవార్త. ఈ కండల వీరుడికి సంబంధించిన అరుదైన సమాచారంతో ఓ డాక్యుమెంటరీ-బయోపిక్‌ తెరకెక్కనుంది. ‘బియాండ్‌ ది స్టార్‌’ పేరుతో అప్లాజ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అనే సంస్థ దీన్ని నిర్మించనుంది. ఇంతకుముందు ఎక్కడా చూడని సల్మాన్‌ బాల్య చిత్రాలు, ఫొటోలు, వీడియోలు ఇందులో పొందుపరచనున్నారు. కుటుంబ సభ్యులు సలీంఖాన్‌, అర్బాజ్‌ఖాన్‌, సోహైల్‌ఖాన్‌ అతడితో తమకున్న అనుబంధాన్ని వివరించనున్నారు. ఇక సల్మాన్‌ తొలి హీరోయిన్‌ భాగ్యశ్రీ నుంచి నేటి దిశా పటానీ వరకు.. అతడితో కలిసి పని చేసిన హీరోయిన్లు, దర్శకనిర్మాతలు సాజిద్‌ నడియాద్‌వాలా, డేవిడ్‌ ధావన్‌, సూరజ్‌ బర్జాత్యా, సంజయ్‌లీలా భన్సాలీ, సుభాష్‌ఘాయ్‌, ప్రభుదేవాలు.. సైతం తమ అభిప్రాయాలు పంచుకోనున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే సల్మాన్‌ఖాన్‌ సమగ్ర జీవిత సమాచారంతో దీన్ని రూపొందించనున్నారు. అతడి పుట్టినరోజు డిసెంబరు 27న ఈ డాక్యుమెంటరీ-బయోపిక్‌ విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని