డాన్‌ త్రయం

‘డాన్‌’లో అమితాబ్‌ బచ్చన్‌ అదరగొడితే.. ‘డాన్‌2’లో షారుక్‌ఖాన్‌ చెలరేగిపోయారు. ఈ రెండు చిత్రాలూ బాక్సాఫీసు దగ్గర భారీ వసూళ్లు రాబట్టాయి. మరి ‘డాన్‌ 3’లో ఈ ఇద్దరూ కలిసి నటిస్తే..? వీళ్లకి తోడుగా రణ్‌వీర్‌సింగ్‌ కీలకపాత్ర పోషిస్తే..? అభిమానులకు పెద్ద పండగే అవుతుంది.చూస్తుంటే.. ఇది సాధ్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నటుడు,

Published : 21 Sep 2022 01:33 IST

‘డాన్‌’లో అమితాబ్‌ బచ్చన్‌ అదరగొడితే.. ‘డాన్‌2’లో షారుక్‌ఖాన్‌ చెలరేగిపోయారు. ఈ రెండు చిత్రాలూ బాక్సాఫీసు దగ్గర భారీ వసూళ్లు రాబట్టాయి. మరి ‘డాన్‌ 3’లో ఈ ఇద్దరూ కలిసి నటిస్తే..? వీళ్లకి తోడుగా రణ్‌వీర్‌సింగ్‌ కీలకపాత్ర పోషిస్తే..? అభిమానులకు పెద్ద పండగే అవుతుంది.చూస్తుంటే.. ఇది సాధ్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నటుడు, దర్శకుడు ఫర్హాన్‌ అఖ్తర్‌ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ‘డాన్‌ 3’ని తెరకెక్కించే బాధ్యత తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో షారుక్‌ కథానాయకుడు అని గతంలోనే ప్రకటించారు. ఆయన కోరిన విధంగా స్క్రిప్టులో కొన్ని మార్పులు సైతం చేశారు. ఇప్పుడు ఫర్హాన్‌.. అమితాబ్‌, రణ్‌వీర్‌లను ఇందులోకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. తరువాయి భాగాల్లో రణ్‌వీర్‌ హీరోగా చేయడానికే తనని ఓ పాత్రలోకి తీసుకున్నట్టు సమాచారం. అమితాబ్‌, రణ్‌వీర్‌లు సానుకూలంగా ఉన్నా.. అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ఏదేమైనా ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి.


ఊహకందని కామెడీ కథతో

‘భూల్‌ భులయ్యా 2’ ఘనవిజయంతో దర్శకుడు అనీస్‌ బజ్మీతో సినిమా చేయడానికి చాలామంది నిర్మాతలు వరుసలో ఉన్నారు. ఎట్టకేలకు ఆయన కొత్త చిత్రానికి పచ్చజెండా ఊపారు. జీ స్టూడియోస్‌, ఎచిలాన్‌ ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించే ఈ ప్రాజెక్టుని పట్టాలెక్కించనున్నట్టు మంగళవారం ప్రకటించారు. ఈ సందర్భంగా జీ స్టూడియోస్‌ సీబీవో షారిక్‌ పటేల్‌ మాట్లాడుతూ ‘మేం అనీస్‌తో కలిసి పని చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కే ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. అనీస్‌ తప్పకుండా మనకోసం ఓ మాస్‌ మసాలా సినిమాని తీసుకొస్తారు’ అని అన్నారు. రచయిత, దర్శకుడు అనీస్‌ బజ్మీ మాట్లాడుతూ ‘భూల్‌ భులయ్యా 2’ విజయం తర్వాత ప్రేక్షకుల కోసం మరో పెద్ద డోసు వినోదం ఇవ్వాలనుకుంటున్నా. ఈసారి ఎవరూ ఊహించని కామెడీ కథతో మీ ముందుకొస్తున్నా. భారతీయ ప్రేక్షకులు ఇంతకుముందు ఎప్పుడూ చూడని విధంగా ఉంటుంది’ అన్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కే ఈ చిత్రం వచ్చే ఏడాది
ద్వితీయార్ధంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని