నేను సిద్ధమే... షారుక్‌నే అడగాలి

దిల్‌సే...షారుక్‌ఖాన్, మణిరత్నం కలయికలో వచ్చిన క్లాసిక్‌ చిత్రం. మనీషా కోయిరాలా, ప్రీతీజింటా కథానాయికలుగా నటించిన ఈ చిత్రం మంచి విజయం అందుకుంది. ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ విడుదల ప్రచారంలో భాగంగా ముంబయిలో ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు మణి.

Updated : 27 Sep 2022 06:32 IST

దిల్‌సే...షారుక్‌ఖాన్, మణిరత్నం కలయికలో వచ్చిన క్లాసిక్‌ చిత్రం. మనీషా కోయిరాలా, ప్రీతీజింటా కథానాయికలుగా నటించిన ఈ చిత్రం మంచి విజయం అందుకుంది. ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ విడుదల ప్రచారంలో భాగంగా ముంబయిలో ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు మణి. ఈ సందర్భంలో షారుక్‌తో మళ్లీ పనిచేసే అవకాశం ఉందా? అని అడిగితే ‘‘ఆ విషయం మీరు షారుక్‌నే అడగాలి. ముందు ఆయన కోసం ఓ మంచి కథ నా దగ్గర సిద్ధంగా ఉండాలి. ఆ తర్వాత ఆయన్ని కలవగలను. ఈ మధ్య ఓ కార్యక్రమంలో మేం కలుసుకున్నాం కానీ మా మధ్య ఎలాంటి చర్చ జరగలేదు’’అని చెప్పారు.


మనసులు గెలిచిన ఆయుష్‌

‘లవ్‌ యాత్రి’, ‘అంతిమ్‌’ చిత్రాలతో యువతరంలో క్రేజ్‌ సంపాదించుకున్నారు ఆయుష్‌ శర్మ. తాజాగా ఆయన ఓ మంచి పని కోసం తన మానవతా దృక్పథాన్ని ప్రదర్శించి అందరి మనసులను గెలుచుకున్నారు. సెక్స్‌ వర్కర్లకు అండగా నిలిచేందుకు ఓ స్వచ్ఛంద సంస్థ ‘పిల్లర్స్‌ ఆఫ్‌ హ్యుమానిటీ’ పేరుతో ముంబయిలో ఓ వేడుక నిర్వహించింది. ఇందులో పాల్గొన్న ఆయుష్‌ ర్యాంప్‌పై నడిచి సెక్స్‌ వర్కర్లకు తన మద్దతు ప్రకటించాడు. అనంతరం వారి హక్కుల గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. ‘‘సెక్స్‌ వర్కర్లకు మద్దతుగా ర్యాంప్‌పై నడవడం నాకు చాలా గర్వంగా ఉంది. సంఘంలో వారు చాలా నిర్లక్ష్యానికి గురవుతున్నారు. నేటికీ వారి పట్ల ఇంత వివక్ష ప్రదర్శించడం.. అసహ్యంతో చూడటం చాలా బాధిస్తుంది. ఓ పౌరుడిగా వారి హక్కులు, గౌరవం కోసం ప్రతి వర్గానికి సాధికారత కల్పించడం నా బాధ్యతగా భావిస్తున్నా’’ అని ఆయుష్‌ శర్మ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని