Sushmita Sen: ట్రాన్స్‌జెండర్‌ పాత్రలో విశ్వసుందరి

బాలీవుడ్‌ అందాల తార, మాజీ మిస్‌ ఇండియా యూనివర్స్‌ సుస్మితాసేన్‌ వెండితెరపై అలరించి ‘ఆర్య’ వెబ్‌సిరీస్‌తో డిజిటల్‌ బాట పట్టిన సంగతి తెలిసిందే.

Updated : 07 Oct 2022 07:15 IST

బాలీవుడ్‌ అందాల తార, మాజీ మిస్‌ ఇండియా యూనివర్స్‌ సుస్మితాసేన్‌ (Sushmita Sen) వెండితెరపై అలరించి ‘ఆర్య’ వెబ్‌సిరీస్‌తో డిజిటల్‌ బాట పట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె నుంచి మరో వెబ్‌సిరీస్‌ రాబోతున్నదన్న కబురు కూడా కొన్ని రోజుల క్రితమే విన్నాం. అదే ‘తాలి’. ఇందులో సుస్మిత ట్రాన్స్‌జెండర్‌ యాక్టివిస్ట్‌ గౌరీ సావంత్‌ పాత్రను పోషిస్తోంది. తాజాగా ఈ సిరీస్‌లో తన లుక్‌ను ఇన్‌స్టా ద్వారా పంచుకుంది సుస్మిత. ‘‘అందమైన వ్యక్తి కథను అంతే అందంగా ఈ ప్రపంచంలోకి తీసుకురావడం ఆనందంగా ఉంది’’అని పోస్ట్‌ చేసింది సుస్మిత. ఈ సిరీస్‌ ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు రాబోయేది మాత్రం ఇంకా ప్రకటించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని