ఆమె.. మా ఆయన భార్య

ఏవండీ ఆవిడ వచ్చింది...ఆయనకు ఇద్దరు...ఈ తరహా చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చిన ప్రతిసారీ ప్రేక్షకులకు వినోదాన్నే పంచాయి. ఇలాంటివి బాలీవుడ్‌లోనూ తెరకెక్కి విజయం సాధించాయి.

Published : 13 Nov 2022 02:33 IST

ఏవండీ ఆవిడ వచ్చింది...ఆయనకు ఇద్దరు...ఈ తరహా చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చిన ప్రతిసారీ ప్రేక్షకులకు వినోదాన్నే పంచాయి. ఇలాంటివి బాలీవుడ్‌లోనూ తెరకెక్కి విజయం సాధించాయి. తాజాగా ఇద్దరు భార్యలు, ఓ భర్త కథతో రాబోతున్న చిత్రం ‘మేరీ హజ్బెండ్‌ కీ బివీ’. ఇందులో అర్జున్‌ కపూర్‌ కథానాయకుడిగా, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, భూమి పెడ్నేకర్‌ నాయకలుగా నటిస్తున్నారు. ముదాస్సర్‌ అలీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వశు, జాకీ భగ్నానీలు నిర్మిస్తున్నారు. ‘‘పూర్తిస్థాయి వినోదాత్మకంగా సాగే చిత్రమిది. ముగ్గురి మధ్య జరిగే ప్రేమ కథలో ప్రేక్షకులకు నచ్చే అంశాలతో తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే ఓ షెడ్యూల్‌ పూర్తయింది’’అని చిత్రవర్గాలు చెప్పినట్లు సమాచారం. ఈ ఏడాది చివరకు ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేసి 2023 జూన్‌ నాటికి విడుదల చేయడానికి
సన్నాహాలు చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు