ఆలస్యంగా.. రాకీ, రాణి ప్రేమకథ

రణ్‌వీర్‌సింగ్‌, అలియాభట్‌ నాయకానాయికలుగా తెరకెక్కిన చిత్రం ‘రాఖీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ’. ఈ ఫ్యామిలీ డ్రామాలో సీనియర్‌ నటులు ధర్మేంద్ర, జయా బచ్చన్‌, షబానా ఆజ్మీ కీలక పాత్రలు పోషించారు.

Published : 14 Nov 2022 01:48 IST

ణ్‌వీర్‌సింగ్‌, అలియాభట్‌ నాయకానాయికలుగా తెరకెక్కిన చిత్రం ‘రాఖీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ’. ఈ ఫ్యామిలీ డ్రామాలో సీనియర్‌ నటులు ధర్మేంద్ర, జయా బచ్చన్‌, షబానా ఆజ్మీ కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉన్న ఈ సినిమా మరింత ఆలస్యంగా వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల కానున్నట్టు దర్శకనిర్మాత కరణ్‌ జోహార్‌ తాజాగా ప్రకటించారు. ఇంతకుముందు వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకొస్తున్నామని తెలిపినా.. అనివార్య కారణాలతో కాస్త ఆలస్యమవుతున్నట్టు పేర్కొన్నారు. ‘నా హృదయం సంతోషం, కృతజ్ఞతలతో నిండిపోయింది. ఏప్రిల్‌ 28, 2023న ‘రాకీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ’తో మీ ముందుకొస్తున్నాం’ అని కరణ్‌జోహార్‌ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. ఏడేళ్ల తర్వాత ఈ చిత్రంతో ఆయన మళ్లీ మెగాఫోన్‌ పట్టుకున్నారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు