కన్నీళ్లు పెట్టిస్తుంది ‘సలామ్‌ వెంకీ’

కాజోల్‌ ప్రధాన పాత్రధారిగా ప్రముఖ నటి, రేవతి తెరకెక్కిస్తున్న చిత్రం ‘సలాం వెంకీ’. ఆమిర్‌ఖాన్‌ అతిథి పాత్రలో కనిపించనున్నారు. సోమవారం ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైంది.

Published : 15 Nov 2022 02:07 IST

కాజోల్‌ ప్రధాన పాత్రధారిగా ప్రముఖ నటి, రేవతి తెరకెక్కిస్తున్న చిత్రం ‘సలాం వెంకీ’. ఆమిర్‌ఖాన్‌ అతిథి పాత్రలో కనిపించనున్నారు. సోమవారం ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. తల్లీ కొడుకుల అనుబంధం ప్రధానంగా సాగే కుటుంబ కథా చిత్రమిది. కాజోల్‌ సుజాత అనే తల్లి పాత్రలో నటిస్తోంది. జీవితం ఆఖరి దశలో ఉన్న దివ్యాంగుడైన ఆమె కొడుకు వెంకటేష్‌గా విశాల్‌ నటించాడు. కొడుకు అంత్య దశలో ఎదురైనా సవాళ్లను ఆ తల్లి ఎలా ఎదుర్కొంది? అతడి కోర్కె తీర్చడానికి ఏం చేసింది? ట్రైలర్‌లో ఇందులో చూపించారు. కొన్ని వాస్తవిక సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా ప్రతి ఒక్కరితో కన్నీళ్లు పెట్టిస్తుందంటోంది చిత్రబృందం. డిసెంబరు 9న ప్రేక్షకుల ముందుకొస్తోంది. సూరజ్‌ సింగ్‌, శ్రద్ధా అగర్వాల్‌, వర్షా కుక్రేజా నిర్మాతలు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు