అలా నాని యాక్ట్‌ చేశాడు..

ఓ కథానాయకుడు నటించాల్సిన చిత్రంలో మరో హీరో నటించడం సహజం. ఇందుకు ఎన్నో కారణాలుండొచ్చు. ప్రముఖ నటులు రామ్‌ చరణ్, నాని విషయంలో ఒకప్పుడు ఇదే జరిగింది. గతంలో చెర్రీ నటించాల్సిన ఓ ప్రేమకథలో నాని నటించి యువత హృదయాల్ని హత్తుకున్నాడు. అదే సినిమా అంటే..

Published : 22 Jan 2020 15:09 IST

గౌతమ్‌ మీనన్‌ సినిమాను తిరస్కరించిన చెర్రీ

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓ కథానాయకుడు నటించాల్సిన చిత్రంలో మరో హీరో నటించడం సహజం. ఇందుకు ఎన్నో కారణాలుండొచ్చు. ప్రముఖ నటులు రామ్‌ చరణ్, నాని విషయంలో ఒకప్పుడు ఇదే జరిగింది. గతంలో చెర్రీ నటించాల్సిన ఓ ప్రేమకథలో నాని నటించి యువత హృదయాల్ని హత్తుకున్నాడు. అదే సినిమా అంటే? ‘ఎటో వెళ్లిపోయింది మనసు’. గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ముందుగా చెర్రీని కథానాయకుడుగా అనుకున్నారట. డేట్స్‌ సర్దుబాటు కాకపోవడం, ఇతర కారణాల వల్ల ఈ చిత్రాన్ని సున్నితంగా తిరస్కరించాడట చరణ్‌. దాంతో ఈ ప్రేమకథలో నటించే అవకాశం నానిని వరించింది. నానికి కథ బాగా నచ్చడంతో ఓకే చేశాడు. అలా ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ అంటూ సమంతను ఉద్దేశించి ‘ప్రియతమా నీవచట కుశలమా’ అని ఆలపించిన గీతం ఎప్పటికీ మర్చిపోలేము కదా!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని