అలా చెప్పి.. తొలిషాట్‌ తీశారు!

‘ముహుర్తపు షాట్‌’ సెంటిమెంట్‌ సినిమా వాళ్లకి ఉంటుంది. అది దర్శకుడికి తొలిచిత్రం తాలూకు తొలి షాట్‌ అయితే ఇక చెప్పనవసరం లేదు. అన్నపూర్ణావారి

Published : 14 Feb 2020 15:18 IST

‘ముహుర్తపు షాట్‌’ సెంటిమెంట్‌ సినిమా వాళ్లకి ఉంటుంది. అది దర్శకుడికి తొలిచిత్రం తాలూకు తొలి షాట్‌ అయితే ఇక చెప్పనవసరం లేదు. అన్నపూర్ణావారి ‘ఆత్మగౌరవం’(1966) చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన ‘కళాతపస్వి’ కె.విశ్వనాథ్‌కి తొలిషాట్‌ విషయంలో ఇబ్బంది ఎదురైంది. ఆస్తికుడిగా ఆయనకి నమ్మకాలు ఉన్నాయి. కానీ, నిర్మాణ సంస్థ అన్నపూర్ణా వారికి, కథానాయకుడు ఏఎన్నార్‌కి అలాంటివి లేనేలేవు.

ముహుర్తపు షాట్‌ని దేవుడి పటాల మీద తీసే అవకాశం విశ్వనాథ్‌కి రాలేదు. అపుడాయన ఆలోచించారు. నిలువుటద్దంలో కథానాయకుడు దుస్తుల్ని సరిచేసుకొనే సన్నివేశం స్క్రిప్ట్‌లో ఉంది. ‘అద్దం శ్రీ మహాలక్ష్మికి ప్రతిరూపం’ అని పెద్దలు చెప్పే మాట విశ్వనాథ్‌కి గుర్తుకు వచ్చింది. వెంటనే అద్దంలో హీరో ఏఎన్నార్‌ టై సరిచేసుకునే దృశ్యాన్ని తొలిషాట్‌గా చిత్రీకరించడంతో పాటు, ‘శ్రీనివాస చక్రవర్తి గారూ..’ అంటూ వెనక నుంచి అల్లు రామలింగయ్య పాత్ర ద్వారా ఏడుకొండల వాడి పేరు చెప్పించి, ‘కళాతపస్వి’ తన కెరీరీకు శుభారంభం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని