రూ.300తో ఇంటి నుంచి పారిపోయిన యశ్‌

‘కేజీఎఫ్‌’తో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన కన్నడ స్టార్‌ యశ్‌. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద విశేషమైన వసూళ్లు రాబట్టి.. ఆ చిత్ర పరిశ్రమ స్థాయిని పెంచింది. త్వరలో ‘కేజీఎఫ్‌’కు కొనసాగింపుగా తీస్తున్న ‘కేజీఎఫ్‌ చాప్టర్‌ 2’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఓ సందర్భంలో యశ్‌ రూ.300.....

Published : 27 Apr 2020 11:27 IST

బెంగళూరు: ‘కేజీఎఫ్‌’తో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన కన్నడ స్టార్‌ యశ్‌. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద విశేషమైన వసూళ్లు రాబట్టి.. కన్నడ పరిశ్రమ స్థాయిని పెంచింది. త్వరలో ‘కేజీఎఫ్‌’కు కొనసాగింపుగా ‘కేజీఎఫ్‌ చాప్టర్‌ 2’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఓ సందర్భంలో యశ్‌ రూ.300 తీసుకుని ఇంటి నుంచి పారిపోయారట. నటుడు కావాలనే కలతో ఆ డబ్బుతో బెంగళూరు చేరుకున్నారట. ఈ విషయాన్ని యశ్‌ స్వయంగా చెప్పారు.

‘నేను ఇంటి నుంచి పారిపోయి బెంగళూరుకు వచ్చేశా. ఈ నగరానికి చేరుకున్న తర్వాత చాలా భయపడ్డా. ఇది చాలా పెద్ద సిటీ. కానీ, నేనెప్పుడూ ఆత్మవిశ్వాసంతోనే ఉన్నా. సమస్యలు ఎదుర్కోవడానికి భయపడలేదు. బెంగళూరుకు వచ్చే సరికీ నా పాకెట్‌లో కేవలం రూ.300 మాత్రమే ఉన్నాయి. నేను తిరిగి ఇంటికి వెళితే నా తల్లిదండ్రులు ఇంట్లోకి రానివ్వరని నాకు తెలుసు. నటుడిగా నా అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అనుకున్నా’.

‘ఒకవేళ నేను నటుడ్ని కాలేకపోతే.. నా తల్లిదండ్రులు ఏం చెబితే అది చేయాల్సిన పరిస్థితి. నేను తిరిగి ఇంటికి వచ్చేస్తానని అమ్మానాన్న అనుకున్నారు. నేను థియేటర్‌లో నటించడం మొదలుపెట్టా. నా అదృష్టవశాత్తూ ఓ వ్యక్తి నన్ను థియేటర్‌కు తీసుకున్నాడు. ఆ సమయంలో నాకు దాని గురించి ఏమీ తెలియదు. పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేస్తూ డబ్బులు సంపాదించడం మొదలుపెట్టా. టీ ఇవ్వడం నుంచి ప్రతిదీ చేశా.. ఎన్నో ప్రదేశాలు తిరిగా. స్టేజీపై నా తొలి ప్రదర్శనను గుర్తించి, అవకాశం ఇచ్చారు’ అని యశ్‌ చెప్పారు. ఆయన తన సినీ కెరీర్‌లో విజయాలతోపాటు అపజయాల్ని కూడా చూశారు. వాటిని పట్టించుకోకుండా నటనపై దృష్టి పెట్టడం వల్ల నేడు ఈ స్థాయిలో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని