ఓవైపు ఆకలేస్తున్నా.. టిఫిన్‌ పెట్టమని అడగలేక!

ఏయన్నార్‌ సినిమా రంగంలో అడు‌గు‌పెట్టి, తన పాటలు తానే పాడు‌కునే దశలో ప్రతిభా వారి ‌‘ముగ్గురు మరా‌ఠీలు’‌

Published : 20 Mar 2021 16:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఏయన్నార్‌ సినిమా రంగంలో అడు‌గు‌పెట్టి, తన పాటలు తానే పాడు‌కునే దశలో ప్రతిభా వారి ‌‘ముగ్గురు మరా‌ఠీలు’‌ చిత్రం వచ్చింది.‌ ఆ సినిమాలో ఏయన్నార్‌కి జోడీగా టి.‌జి కమ‌లా‌దేవి నటించారు.‌ అందులో ఆ ఇద్దరూ కలిసి ‌‘చల్‌.‌.‌ చలో వయ్యారీ షికారీ’‌ అనే డ్యూయెట్‌ సొంతంగా పాడు‌కు‌న్నారు.‌ దానితో పాటు ఆరం‌భంలో వచ్చే ప్రార్థన గీతం ‌‘జైజై భైరవ త్రిశూ‌ల‌ధారీ’‌ బృంద గీతాన్ని కన్నాంబతో కలిసి ఏయన్నార్, టి.‌జి కమ‌లా‌దేవి పాడారు.‌ ఈ బృంద‌గీతం రికా‌ర్డింగ్‌ అప్పటి శోభ‌నా‌చల థియే‌ట‌ర్‌లో జరి‌గింది.‌ మధ్యాహ్నం మొద‌లైన రికా‌ర్డింగ్‌ సాయంత్రం వరకు కొన‌సా‌గింది.‌ మధ్యలో బ్రేక్‌ ఇచ్చారు.‌ అంద‌రికీ ఆక‌లిగా ఉంది.‌ టిఫిన్, కాఫీలు వచ్చాయి.‌

కానీ, అప్పట్లో ఫీల్డ్‌లో సీని‌యర్‌ అయిన కన్నాంబకు మాత్రమే వాటిని సప్లయ్‌ చేసి.‌.‌ ఏయన్నార్, టి.‌జి కమ‌లా‌దేవి లాంటి జూని‌యర్‌ మోస్ట్‌ ఆర్టి‌స్టు‌లకు కనీసం మంచి నీళ్లయినా ఇచ్చే నాథుడు లేక‌పో‌యాడట.‌ ఏయన్నార్‌కు కోపం ముంచు‌కొ‌చ్చిందట.‌ టిఫిన్‌ పెట్టండి అని నోరు విప్పి అడి‌గేందుకు ఆత్మా‌భి‌మానం అడ్డొచ్చి, కోపంగా స్టూడియో బయ‌టకు వెళ్లి‌పో‌యా‌రట.‌ మద్రాసు వెళ్లిన కొత్తల్లో కొను‌గోలు చేసిన ర్యాలీ సైకిల్‌ వేసు‌కొని, లజ్‌ రోడ్డు వరకు వెళ్లి తనకు, తనతో పాటు హీరో‌యి‌న్‌గా నటించి, ఆ రోజు రికార్డింగ్‌లో పాడు‌తున్న టి.‌జి కమ‌లా‌దే‌వికీ స్పెషల్‌ కేకులు కొని తెచ్చా‌రట! అది చూసి ప్రొడక్షన్‌ వాళ్లు కుర్రా‌డికి పౌరుషం ఎక్కువే అను‌కొ‌న్నా‌రట!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు