Mahesh babu: మహేశ్‌బాబు చెట్టెక్కి కూర్చున్నాడు
సినిమాలో నటించమని అడిగితే బాల్యంలో మహేశ్‌బాబు చెట్టెక్కి కూర్చున్నాడని దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ ఓ సందర్భంలో చెప్పారు.
హైదరాబాద్: సినిమాలో నటించమని అడిగితే బాల్యంలో మహేశ్‌బాబు చెట్టెక్కి కూర్చున్నాడని దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ ఓ సందర్భంలో చెప్పారు. ఆయన తెరకెక్కించిన ‘పోరాటం’ (1983) సినిమాలో మహేశ్ పూర్తిస్థాయి పాత్రలో బాలనటుడిగా సందడి చేశారు. ఈ సినిమాలో తన తండ్రి కృష్ణ సోదరుడి పాత్రలో నటించారు. ఇందులో మహేశ్ నటించడం గురించి దివంగత కోడి రామకృష్ణ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. బాల్యంలో మహేశ్ చాలా అల్లరి చేసేవాడని తెలిపారు.
‘‘పోరాటం’ సెట్‌కు మహేశ్ వస్తుండేవాడు. అప్పుడు చిన్నపిల్లాడు. ఈ సినిమాలో కృష్ణ చిన్న తమ్ముడు పాత్ర ఉంది. దానికి మహేశ్ బాగుంటాడు అనిపించింది. ‘కృష్ణ గారు మీ సోదరుడి పాత్రలో మహేశ్‌ను తీసుకుందామండి’ అని ఓ రోజు అడిగా. దానికి కృష్ణ నవ్వుతూ.. ‘అవునా.. వాడు అసలు ఎవరి మాట వినడు. వాడు ఒప్పుకోడు. నువ్వు కావాలంటే ఒప్పించుకో’ అన్నారు. నేను సరే అన్నా. అప్పుడు మహేశ్ సెట్‌లో ఉన్న ఓ చెట్టు దగ్గర ఆడుకుంటూ ఉన్నాడు. అక్కడికి వెళ్లి ‘బాబు నీకు సినిమాలో చేయాలని ఉందా?’ అని అడిగా. ‘లేదు’ అన్నాడు. ‘ఎందుకు’ అని అడిగా.. ‘సినిమాలంటే మనం జాగ్రత్తగా ఉండాలిగా. మా నాన్న గారిని చూస్తున్నాగా నేను’ అని చిన్నతనంలోనే అవగాహన ఉన్నట్లు అన్నాడు. ‘నీ పాత్ర బాగుంటుంది’ అని ఒప్పించబోయా. అంతే ‘నేను చేయను, నేను చేయను’ అంటూ చెట్టు ఎక్కేశాడు. తర్వాత ‘మీ నాన్న ముఖం నీకే ఉంది. నువ్వే తమ్ముడిగా సరిపోతావు’ అని ఒప్పించా. ‘పోరాటం’ సినిమాలో మహేశ్ పాత్ర బాగుంటుంది. మహేశ్ కళ్లజోడు పగిలిపోయే సీన్ ఉంటుంది.. దాన్ని చూస్తే ఇప్పటికీ మనకు ఏడుపు వస్తుంది’ అని కోడి రామకృష్ణ నాడు గుర్తు చేసుకున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Social look: ఐఫాలో తారల మెరుపులు.. పెళ్లి సంబరంలో కీర్తి హోయలు
-
India News
Shashi Tharoor: ‘ప్రస్తుత విలువలకు చిహ్నంగా అంగీకరించాలి’.. సెంగోల్‌పై కాంగ్రెస్ ఎంపీ ట్వీట్
-
Movies News
Hanuman: ‘ఆది పురుష్’ ప్రభావం ‘హనుమాన్’పై ఉండదు: ప్రశాంత్ వర్మ
-
Politics News
Nara Lokesh: పోరాటం పసుపు సైన్యం బ్లడ్‌లో ఉంది: లోకేశ్
-
Sports News
IPL Final: అహ్మదాబాద్‌లో వర్షం.. మ్యాచ్ నిర్వహణపై రూల్స్ ఏం చెబుతున్నాయి?
-
India News
Manipur: మణిపుర్ ప్రభుత్వం ఉక్కుపాదం.. 40 మంది తిరుగుబాటుదారుల హతం