ఉత్తమనటి వివాదంలో సావిత్రి-భానుమతి
ఆ రోజుల్లో మద్రాసులో ఫిల్మ్ ఫ్యాన్స్ అసోసియేషన్‌కి మంచి పేరు ఉండేది. ఆ సంఘ ఏటా ఉత్తమ చిత్రాలకు బహుమతులు ప్రకటించేది.
ఇంటర్నెట్‌డెస్క్: ఉత్తమ చిత్రాలను, నటులను ఎంపిక చేసేటప్పుడు వివాదాలు రావడం సహజం. కొన్ని నెలల కిందట నంది అవార్డుల విషయంలోనూ వివాదం రాజుకున్న సంగతి తెలిసిందే. ఆ రోజుల్లో మద్రాసులో ఫిల్మ్ ఫ్యాన్స్ అసోసియేషన్‌కి మంచి పేరు ఉండేది. ఆ సంఘ ఏటా ఉత్తమ చిత్రాలకు బహుమతులు ప్రకటించేది. 1953లో సెన్సారైన తమిళ, తెలుగు చిత్రాలు పోటీకి వెళ్లాయి. పోటీలో ‘దేవదాసు’ (Devadasu), ‘చండీరాణి’ (chandirani) మొదలైనవి ఉన్నాయి. ఆ చిత్రాలన్నీ చూసిన న్యాయనిర్ణేతలు ఒక్కరే. తెలుగులో ఉత్తమ నటుడిగా నాగేశ్వరరావు (దేవదాసు), ఉత్తమనటిగా భానుమతి (చండీరాణి) ఎంపికయ్యారు. అయితే, తమిళానికి సంబంధించి ‘దేవదాసు’లో పాత్రకు గానూ సావిత్రి (savitri) ఉత్తమనటిగా ఎంపిక కావడం విశేషం.
రెండు చిత్రాలను రెండు భాషల్లోనూ నిర్మించారు. రెండూ పోటీలో నిలిచాయి. తమిళంలో సావిత్రికి ఇచ్చినప్పుడు తెలుగులో కూడా సావిత్రికి ఎందుకివ్వలేదు? అదే ‘దేవదాసు’ సినిమా కదా! భానుమతి(Bhanumathi)ని ఎందుకు నిర్ణయించారు? అని వివాదం మొదలైంది. భానుమతి కూడా రెండు భాషల్లో ‘చండీరాణి’లో నటించారు. మరి తమిళంలో ఆమెకు ఎందుకు అవార్డు ఇవ్వలేదు? లేక ఇద్దరికీ పంచారా? ఇలా పత్రికల్లో వ్యాసాలు, లేఖలు ప్రచురితమయ్యాయి. ఈ వరుస కథనాలపై ఆ జడ్జీలు స్పందించలేదు. తమ నిర్ణయాల ప్రకారమే పురస్కార సభలో బహుమతులు అందజేశారు. తమిళ ‘దేవదాసు’ చిత్రానికి ఉత్తమ నటిగా సావిత్రి సభకు వెళ్లి బహుమతి అందుకున్నా, తెలుగు ‘చండీరాణి’ చిత్రానికి ఉత్తమనటి అవార్డును అందుకోవడానికి భానుమతి కార్యక్రమానికి హాజరు కాలేదు. ఈ వివాదం వల్లే ఆమె అవార్డు అందుకోవడానికి రాలేదని ప్రేక్షకులు అనుకున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
PBKS vs KKR: పంజాబ్ X కోల్‌కతా.. కొత్త సారథుల మధ్య తొలి పోరు
-
Movies News
Rolex: ఒకే స్టేజ్‌పై విక్రమ్ - రోలెక్స్.. సినిమా ఫిక్స్ చేసిన లోకేశ్
-
General News
Andhra News: ఏప్రిల్ 3 నుంచి ఏపీలో ఒంటి పూట బడులు : బొత్స
-
Politics News
Nara Lokesh : అవినీతిని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?: నారా లోకేశ్
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Sanjay Raut: ‘దిల్లీకి వస్తే.. ఏకే-47తో కాల్చేస్తామన్నారు..’: సంజయ్ రౌత్