Gundamma katha: ఎన్టీఆర్.. ఏయన్నార్ విజిల్స్... హిట్!
‘గుండమ్మకథ’లోని ఒక సీన్‌లో ఎన్టీఆర్, ఏయన్నార్‌ల మధ్య డైలాగ్స్ ఉండవు. సీన్ మొత్తం కేవలం విజిల్స్‌తో నడుస్తుంది.
‘గుండమ్మకథ’లోని ఒక సీన్‌లో ఎన్టీఆర్, ఏయన్నార్‌ల మధ్య డైలాగ్స్ ఉండవు. సీన్ మొత్తం కేవలం విజిల్స్‌తో నడుస్తుంది. రచయిత డి.వి.నరసరాజు ఆ సీన్ మద్రాసులోని ఇంట్లో కూర్చొని రాశారట. ఎన్టీఆర్ గుండమ్మ గారింట్లో పనివాడి (మారు) వేషంలో ఉంటాడు. ఓ రోజు ఆ ఇంటికి ఆయన తమ్ముడైన ఏయన్నార్ తన ప్రేయసి (జమున) కోసం వస్తాడు. ‘ఇంట్లో నా ప్రేయసి ఉందా?’ అని ఎన్టీఆర్‌ని ఏయన్నార్ అడుగుతాడు అని మొదట నరసరాజు రాశారట. ‘ప్రేయసి’ బరువైన మాటలాగా అనిపించి, ‘ఇంట్లో నా పిట్ట ఉందా?’ అని మార్చారట. ‘పిట్ట’ మరీ చీప్‌గా అనిపించి, ‘ఇంటో ఆమె (జమున) ఉందా?’ అని స్ఫురించేలా ఏయన్నార్ ఈలతో అడిగినట్లు, వెంటనే ‘ఉంది’ అని ధ్వనించేలా ఎన్టీఆర్ ఈలతోనే సమాధానం చెప్పినట్టు రాసి, ఇంటికి ప్రొడక్షన్ కారు రావడంతో నరసరాజు ఆ పూటకి సగం సీన్ మాత్రమే రాసి, స్క్రిప్టును తీసుకెళ్లి విజయా స్టూడియోలో చక్రపాణికి చూపించారట. వెంటనే చక్రపాణి విజిల్స్‌తో సంభాషణ బాగుందని, సీన్‌లోని మిగిలిన భాగాన్ని కూడా విజిల్స్‌తోనే కొనసాగించమని అన్నారట. నరసరాజు అలానే రాశారు. హాల్లో జనం అగ్రనటుల విజిల్స్ సీన్ చూసి తెగ ఈలలు వేశారు. రాసేటప్పుడు రచయిత సరైన మాట దొరక్క విజిల్స్‌ను ఆశ్రయిస్తే ఆ సీన్ సూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో ఎస్వీఆర్ పాత్రనూ ప్రేక్షకులు మర్చిపోలేరు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Jewellery Shop: నగల దుకాణంలో భారీ చోరీ.. రూ. 25 కోట్ల విలువైన ఆభరణాలు దోచుకెళ్లిన దొంగలు
-
Cricket News: బీసీసీఐ ఏజీఎంలో కీలక నిర్ణయాలు.. భారత్ ఇంకా మెరుగవ్వాలి.. మెగా టోర్నీకి కేన్ సిద్ధం!
-
Lava Blaze Pro 5G: ₹12వేలకే లావా 5జీ ఫోన్.. రిపేరైతే ఇంటికొచ్చి సర్వీస్!
-
Asian Games: భారత్ జోరు.. సెయిలింగ్‌లో మరొక పతకం
-
Chandrababu: అంగళ్లు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వు
-
Sreeleela-Rashmika: శ్రీలీల.. రష్మిక.. ఒకరి స్థానంలో మరొకరు!