రాజశేఖర్‌ తరపున క్షమాపణ: జీవిత

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) డైరీ విడుదల కార్యక్రమం రసాభాసగా మారిన విషయం తెలిసిందే. ‘మా’లో ఉన్న విబేధాలను ఎత్తి చూపుతూ రాజశేఖర్‌ చేసిన వ్యాఖ్యలపై చిరంజీవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై గట్టి చర్యలు తీసుకోవాలని ‘మా’ని కోరారు.

Updated : 02 Jan 2020 19:02 IST

హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) డైరీ విడుదల కార్యక్రమం రసాభాసగా మారిన విషయం తెలిసిందే. ‘మా’లో ఉన్న విబేధాలను ఎత్తి చూపుతూ రాజశేఖర్‌ చేసిన వ్యాఖ్యలపై చిరంజీవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై గట్టి చర్యలు తీసుకోవాలని ‘మా’ని కోరారు.
అనంతరం వేదికపైకి వచ్చిన జీవిత క్షమాపణలు తెలిపారు. అందరం కలిసి ‘మా’ని మరింత గొప్పస్థాయికి తీసుకువెళ్లాలని ఆమె ఆకాంక్షించారు. ‘‘మా’ కార్యవర్గంలో సభ్యురాలినైనప్పటి నుంచి నేటి వరకూ నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. ఎందరో గొప్ప నటీనటుల వల్లే నేను ఎన్నో నేర్చుకున్నారు. అందరిలాగానే మాలో కూడా కొన్ని విబేధాలున్నాయి. గొడవలు రావడం సహజం. రాజశేఖర్‌, నేను ‘మా’ను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేయాలనుకున్నాం. ఆయన చిన్నపిల్లాడు లాంటివాడు. ఇలాంటి కార్యక్రమంలో ఆయన అలా మాట్లాడినందుకు  క్షమించమని నేను కోరుతున్నాను. విబేధాలున్నా సరే డైరీ విడుదల కార్యక్రమాన్ని అందరూ కలిసి చేయాలని మెగాస్టార్‌ చెప్పారు. నరేష్‌, రాజశేఖర్‌ మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ఇక ముందు కూడా మేమందరం కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాం’ అని జీవిత చెప్పారు.   

ఇవీ చదవండి..!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని