రాజశేఖర్‌ కాస్త ఆవేశపరుడంతే..: మురళీమోహన్‌

‘మంచి ఉంటే మైకులో మాట్లాడుకుందాం.. చెడు ఉంటే చెవిలో మాట్లాడుదాం’ అని చిరంజీవి చెప్పిన మాట అద్భుతమని సీనియర్‌ నటుడు మురళీ మోహన్‌ అన్నారు. మూవీ

Published : 02 Jan 2020 16:29 IST

‘మంచి ఉంటే మైకులో మాట్లాడుకుందాం.. చెడు ఉంటే చెవిలో మాట్లాడుదాం’ అని చిరంజీవి చెప్పిన మాట అద్భుతమని సీనియర్‌ నటుడు మురళీ మోహన్‌ అన్నారు. మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) డైరీ ఆవిష్కరణ కార్యక్రమం రసాభాస అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మురళీ మోహన్‌ మాట్లాడుతూ.. ‘‘కార్యక్రమం చాలా చక్కగా జరిగింది. మా అసోసియేషన్‌లో ఉన్న చిన్న చిన్న అభిప్రాయ భేదాలను సరిచేయాలని ఉద్దేశంతోనే ఇంత పెద్దగా డైరీ ఆవిష్కరణ కార్యక్రమం పెట్టాం. కార్యవర్గం కూడా బాగుంది. మన చేతికున్న ఐదు వేళ్లే సరిగ్గా ఉండవు. కానీ, అన్ని కలిస్తే పిడికిలి అవుతుంది. ఏదైనా సాధించగలం. అంతేకానీ వేరే గొడవలు ఏవీ లేవు. రాజశేఖర్‌ కాస్త ఆవేశపరుడు. అది అందరికీ తెలుసు. ఆ ఆవేశంలో మాట్లాడతాడు.. ఆ తర్వాత ఏమీ ఉండదు. సీనియర్‌ నటులకు గౌరవం లేదన్నది కేవలం ఆరోపణ మాత్రమే. మేమంతా వచ్చాం కదా! ప్రతి కుటుంబంలో అన్నదమ్ములు, భార్యభర్తల మధ్య అభిప్రాయ భేదాలు ఉండటం సహజం. ‘మంచి ఉంటే మైకులో మాట్లాడుకుందాం.. చెడు ఉంటే చెవిలో మాట్లాడుదాం’ అని చిరంజీవిగారు చెప్పిన మాట అద్భుతం. ఈ క్యాప్షన్‌ను మా అసోసియేసన్‌ ప్రధాన ద్వారం దగ్గర పెట్టమని నరేష్‌కు చెప్పా. ఇది అందరూ చదవాలి. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉంటాయి. వాటిని సరిచేశాం. రాబోయే రోజుల్లో అన్నీ బాగుంటాయి. ఒక వేళ ఏవైనా ఉంటే, క్రమశిక్షణ కమిటీ వాటిని పరిష్కరిస్తుంది. రాజశేఖర్‌పై యాక్షన్‌ తీసుకుంటామా? లేదా? అన్నది కమిటీ వేసిన తర్వాతే నిర్ణయిస్తాం’’ అన్నారు.

అనంతరం మా అధ్యక్షుడు నరేశ్‌ మాట్లాడుతూ.. ‘‘ఇంతమంది వచ్చి ‘మా’ డైరీని ఆవిష్కరించడం. మా చరిత్రలో ఇదే తొలిసారి. అంతేకాదు, పథకాలు అమలు గురించి మాట్లాడటం కూడా గొప్పతనం. వెల్ఫేర్‌ కమిటీకి ఒక సంపూర్ణత వచ్చింది. జీవిత నా సోదరిలాంటిది. ‘మా’లో ఉన్నా లేకపోయినా కలిసే ఉంటాం. మేమంతా ఒకటే. భిన్నత్వంలో ఏకత్వం అన్నది భారతదేశ నినాదం. దేశంలో ఇన్ని కులాలు, మతాలు కలిసినప్పుడు, మేం నలుగురం కలవడం పెద్ద విషయం కాదు’’ అని పేర్కొన్నారు. 

ఇవీ చదవండి..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని