ఘనంగా జీ అవార్డుల వేడుక..తారల మెరుపులు

చిత్ర పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే జీ సినీ తమిళ అవార్డుల వేడుక అట్టహాసంగా జరిగింది. చెన్నైలో శనివారం రాత్రి నిర్వహించిన ఈ కార్యక్రమానికి కోలీవుడ్‌ సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ధనుష్‌, అజిత్‌, నయనతార, సమంత, ఐశ్వర్య రాజేష్‌, కమల్‌ హాసన్‌ తదితరులు పాల్గొన్న....

Updated : 05 Jan 2020 16:22 IST

విజేతలు వీరే..!

చెన్నై: చిత్ర పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే జీ సినీ తమిళ అవార్డుల వేడుక అట్టహాసంగా జరిగింది. చెన్నైలో శనివారం రాత్రి నిర్వహించిన ఈ కార్యక్రమానికి కోలీవుడ్‌ సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ధనుష్‌, అజిత్‌, నయనతార, సమంత, ఐశ్వర్య రాజేష్‌, కమల్‌ హాసన్‌ తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు. 2019లో తమిళ చిత్ర పరిశ్రమ అనేక హిట్లు అందుకుంది. ‘అసురన్‌’, ‘బిగిల్‌’, ‘సూపర్‌ డీలక్స్‌’, ‘విశ్వాసం’, ‘కన్నా’, ‘పేటా’ ఇలా పలు సినిమాలు ప్రేక్షకుల మన్ననలు పొందాయి. వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన వారికి అవార్డులు ప్రదానం చేశారు. ఉత్తమ నటిగా సమంత పురస్కారం అందుకున్నారు. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌ ‘మోస్ట్‌ ఎంపవరింగ్‌ పర్ఫామెన్స్‌ ఆఫ్‌ ది డికేడ్‌’ అవార్డును అజిత్‌కు ప్రదానం చేశారు.

ఈ వేడుకలో అవార్డులు అందుకున్న వారి జాబితాను చూద్దాం..

ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా అవార్డు: కమల్‌ హాసన్‌
ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియన్‌ మ్యూజిక్‌ అవార్డు: ఎ.ఆర్‌. రెహమాన్‌
ప్రైడ్‌ ఆఫ్‌ కన్నడ సినిమా: సుదీప్‌
శ్రీదేవి అవార్డు: నయనతార

 ఉత్తమ సహాయ నటి: రమ్యకృష్ణ (‘సూపర్‌ డీలెక్స్‌’)
 ఉత్తమ సహాయ నటుడు: జార్జ్‌ మర్యన్‌ (‘ఖైదీ’)
 ఉత్తమ హాస్యనటుడు: యోగిబాబు (‘కోమలి’)
 ఉత్తమ నేపథ్య గాయిని: శ్రేయాఘోషల్‌ (‘ఎన్జీకే’లోని ‘అంబే పేరంబే..’ పాట)
 ఉత్తమ కొరియోగ్రాఫర్‌: విజయ్‌ కార్తిక్‌ (‘ఆడై’)
 ఉత్తమ నటుడు: ధనుష్‌ (‘అసురన్‌’)

ఉత్తమ నటి-జ్యూరీ స్పెషల్‌: సమంత (‘సూపర్‌ డీలెక్స్‌’)
ఉత్తమ నటి: ఐశ్వర్య రాజేష్‌ (‘కన్నా’)
ఉత్తమ నటుడు (పరిచయం): ధ్రువ్‌ విక్రమ్‌ (‘ఆదిత్య వర్మ’)
ఉత్తమ దర్శకుడు: వెట్రి మారన్‌ (‘అసురన్‌’)
 ఉత్తమ దర్శకుడు (పరిచయం): అరుణ్‌రాజా కామరాజా (‘కన్నా’)

ఉత్తమ సంగీత దర్శకుడు: అనిరుధ్‌ (‘పేట’)
ఉత్తమ కొరియోగ్రాఫర్‌: ప్రభుదేవా (‘మారి 2’లోని ‘రౌడీ బేబీ..’ పాటకు)
ఉత్తమ ఎడిటర్‌: సత్యరాజ్‌ నటరాజ్‌ (‘సూపర్‌ డీలెక్స్‌’)
ఉత్తమ ఆర్ట్‌ డైరెక్టర్‌: ఇజయ్‌ అథినతన్‌ (‘సూపర్‌ డీలెక్స్‌’)
ఉత్తమ నేపథ్య గాయిని: పద్మప్రియ (‘ఐరా’లోని మేఘదూధమ్‌ పాటకు)

ఉత్తమ సాహిత్య రచయిత: తమరై (‘విశ్వాసం’లోని కన్నా కన్నె.. పాటకు)
ఫేవరెట్‌ దర్శకుడు: లోకేష్‌ కనగరాజ్‌ (‘ఖైదీ’)
ఫేవరెట్‌ మూవీ: ‘విశ్వాసం’
ఫేవరెట్‌ నటి: నయనతార (‘విశ్వాసం’)
మోస్ట్‌ స్పెషల్‌ రెస్పాన్సిబుల్‌ యాక్టర్: విజయ్‌ సేతుపతి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని