మెగాస్టార్ ప్రశంస.. విజయశాంతి స్పందన
మెగాస్టార్ చిరంజీవి - విజయశాంతి.. ఒకప్పుడు టాలీవుడ్లో వీరిద్దరిది హిట్ కాంబినేషన్. వీరిద్దరు కలిసి సుమారు 20 సినిమాల్లో నటించి ఎందరో ప్రేక్షకులను ఫిదా చేశారు. రాజకీయాల్లో ప్రవేశించిన వీరిద్దరు కొంతకాలంపాటు సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. తాజాగా విజయశాంతి..
సోషల్‌మీడియా వేదికగా నటి స్పెషల్ పోస్ట్
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి-విజయశాంతి.. ఒకప్పుడు టాలీవుడ్లో వీరిద్దరిది హిట్ కాంబినేషన్. వీరిద్దరు కలిసి సుమారు 20 సినిమాల్లో నటించి ఎందరో ప్రేక్షకులను ఫిదా చేశారు. రాజకీయాల్లో ప్రవేశించిన వీరిద్దరు కొంతకాలంపాటు సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. తాజాగా విజయశాంతి.. మహేశ్ బాబు కథానాయకుడిగా తెరకెక్కిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో నటించారు. అయితే ఇటీవల జరిగిన ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీరిలీజ్ వేడుకలో చాలా సంవత్సరాల తర్వాత చిరంజీవి, విజయశాంతి కలిసి ఒకే వేదికను పంచుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ‘విజయశాంతి ఓ లేడీ సూపర్‌స్టార్, లేడీ అమితాబ్’ అని ప్రశంసించారు.
చిరంజీవి ప్రశంసలపై స్పందించిన విజయశాంతి సోషల్‌మీడియా వేదికగా స్పెషల్ పోస్ట్ పెట్టారు. లేడీ సూపర్‌స్టార్, లేడీ అమితాబ్ అని చిరంజీవి ప్రశంసించడంతో ఆ పదాలకు ఒక విలువ, పదింతల మర్యాద లభించినట్లు భావిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని కల్పించిన అనిల్ రావిపూడి, మహేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
‘నటనా పరమైన ప్రశంసల వల్ల లభించే సంతోషం ఒకటైతే.. కమర్షియల్ సినిమాల విజయంతో సాధించే స్టార్డమ్ ఇమేజ్ వల్ల అందుకునే ఆనందం ఇంకొకటి. ఈ రెండూ కళాకారులను అత్యంత ప్రభావితం చేయగలిగే అంశాలన్నది నా అభిప్రాయం. జాతీయ ఉత్తమ నటిగా నేను అవార్డు తీసుకున్న సందర్భంలో ఎంత గౌరవంగా భావించానో.. నటనకు డిక్షనరీ లాంటి మహానటుడు శివాజీ గణేషన్ గారు నన్ను ‘గ్రేట్ ఆర్టిస్ట్, నా దత్తపుత్రిక’ అని సంబోధించినప్పుడు అంతకుమించి గౌరవంగా భావించాను. అలాగే కమర్షియల్ సినిమాల పరంగా ఎన్ని విజయాలు సాధించినా.. లేడీ సూపర్‌స్టార్, లేడీ అమితాబ్ లాంటి అభినందనలు పొందినా.. ఆ మాటను తెలుగు సినిమాను కమర్షియల్ పరంగా, కలెక్షన్ల పరంగా అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పడంతో ఆ పదాలకు ఒక విలువ, పదింతల మర్యాద లభించినట్లుగా భావిస్తున్నాను. సాధారణంగా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇలాంటి ప్రశంసలు అందుకోవడం ఆనవాయితీ. కానీ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లోనే మెగాస్టార్ నుంచి నేను అభినందనలు అందుకోవడానికి అవకాశం కల్పించిన సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి కృతజ్ఞతలు. ‘సరిలేరు నీకెవ్వరు’ దర్శకుడు రావిపూడి గారితో పాటు... మొత్తం చిత్ర యూనిట్‌కు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.’ అని విజయశాంతి పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్‌రాజు
రామ్‌చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో వేడుకలు జరిగాయి. పలువురు సినీ ప్రముఖులు ఇందులో సందడి చేశారు. చరణ్‌తో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్‌తో కృతి సనన్
సినీ తారలు సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ పొలిటికల్ పార్టీల తరఫున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. -
సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్.. కారణమిదేనా!
దీపికా పదుకొణెకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె సినిమాలకు బ్రేక్ తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
వారిద్దరు టామ్ అండ్ జెర్రీలా.. మెగా, మంచు ఫ్యామిలీలపై మనోజ్ డైలాగ్
రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలకు హీరో మంచు మనోజ్ తదితరులు అతిథులుగా హాజరై, సందడి చేశారు. -
జాన్వీతో రామ్ చరణ్ సినిమా.. ఏడేళ్ల క్రితమే కోరిక బయటపెట్టిన చిరంజీవి
రామ్ చరణ్- జాన్వీ కపూర్ కలిసి సినిమా చేయాలని చిరంజీవి ఏడేళ్ల క్రితమే కోరుకున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని బయటపెట్టారు. -
వరుస పరాజయాలతో నిద్రలేని రాత్రులు.. నేను కాబట్టి తట్టుకోగలిగా: స్టార్ హీరోయిన్
దాదాపు 25 ఏళ్ల సినీ కెరీర్లో తాను ఎదుర్కొన్న ఇబ్బందులపై బాలీవుడ్ నటి కరీనా కపూర్ (Kareena Kapoor) స్పందించారు. కెరీర్ ఆరంభంలో ఎన్నో ప్రశంసలు అందుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద విజయం అందుకోవడానికి అవి ఏమాత్రం ఉపయోగపడలేదన్నారు. -
‘ఇదొక అద్భుతమైన చిత్రం.. ప్రేక్షకులు తప్పక సపోర్ట్ చేయాలి’ - కమల్ హాసన్
పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రలో నటించిన ‘ఆడు జీవితం’(Aadujeevitham)పై అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) ప్రశంసల వర్షం కురిపించారు. -
వివాహ బంధంలోకి సిద్ధార్థ్ - అదితి రావు
నటుడు సిద్ధార్థ్ (Siddharth) అదితిరావు హైదరీ (Aditi Rao Hydari)ని వివాహం చేసుకున్నారు. -
రామ్‌చరణ్ బర్త్‌డే.. భక్తులకు సురేఖ అన్నదానం
నటుడు రామ్‌చరణ్ (Ram Charan) పుట్టినరోజు నేడు. ఈ వేడుకలను ఆయన తల్లి సురేఖ ప్రత్యేకంగా సెలబ్రేట్ చేశారు. -
లండన్‌లో ఇల్లు కొన్న ప్రభాస్..?
ప్రభాస్(prabhas)కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం నెట్టింట వైరల్‌గా మారింది. విలాసవంతమైన ఇంటిని ఆయన కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. -
11 మంది హీరోలను పరిచయం చేయనున్న నిహారిక!
నిహారిక నిర్మిస్తోన్న ఓ సినిమాతో ఇండస్ట్రీకి 11 మంది హీరోలుగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. -
నయనతార, ప్రియాంక చోప్రా ఫ్యామిలీ పిక్స్.. మిర్నా హొయలు.. రాశీసింగ్ మెరుపులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఇప్పుడు బెంగళూరులో.. రేపు ఎక్కడైనా: నీటి విలువపై చిరంజీవి పోస్ట్
బెంగళూరు నీటి సమస్యపై ప్రముఖ హీరో చిరంజీవి స్పందించారు. -
Naga Vamsi: పెద్ద హీరోల సినిమాల్లో లాజిక్‌లు చూడొద్దు: నాగవంశీ
సినిమాను వినోదం కోసం మాత్రమే చూడాలని నిర్మాత నాగవంశీ అన్నారు. ‘గుంటూరు కారం’ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యాక దాన్ని చాలా మంది మెచ్చుకొన్నారని తెలిపారు. -
Tillu Square: తెరపై హాట్‌గా కనిపించడం చాలా కష్టం: అనుపమ పరమేశ్వరన్
స్క్రీన్‌పై హాట్‌గా కనిపించడం చాలా కష్టమని నటి అనుపమ పరమేశ్వరన్ అన్నారు. ‘టిల్లు స్క్వేర్’ ప్రమోషన్స్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. -
Vijay Deverakonda: ఇప్పటికీ సర్దుకుపోతుంటా: విజయ్ దేవరకొండ
తన కొత్త సినిమా ‘ఫ్యామిలీస్టార్’ ప్రచారంలో భాగంగా యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చారు విజయ్ దేవరకొండ. ఆ విశేషాలివీ.. -
Social Look: హోలీ స్పెషల్.. రష్మిక వర్కింగ్.. ఫ్యామిలీతో కియారా.. పాయల్, కాజల్ ఇలా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
Shruti Haasan: ప్రేమించడం ఒక భ్రమని నమ్ముతున్నా: శృతిహాసన్
హీరోయిన్ శృతిహాసన్ తాను నటించిన ‘ఇనిమేల్’ పాట గురించి తెలిపారు. -
Triptii Dimri: అలా కెరీర్ ప్రారంభించాలంటే ధైర్యం కావాలి: త్రిప్తి డిమ్రి
నటి ప్రియాంక చోప్రా అంటే తనకెంతో ఇష్టమని త్రిప్తి డిమ్రి మరోసారి వెల్లడించారు. -
siddhu jonnalagadda: మంచి కథలు నా వద్దకు వచ్చేవి కాదు: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ విడుదల నేపథ్యంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడారు.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్‌రాజు
-
కొనసాగుతున్న మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక
-
‘అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఆమె’.. నెట్టింట వైరల్‌గా మారిన కావ్యా మారన్
-
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
-
కంగనపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సుప్రియా శ్రీనేత్‌కు కాంగ్రెస్ షాక్!
-
ఉపాధి కూలీల కనీస వేతనం రూ.300