Published : 08 Jan 2020 20:45 IST

యశ్‌ కోసం కేక్‌ చేసిన ఐరా

బెంగళూరు: కన్నడ రాక్‌స్టార్‌ యశ్‌ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా యశ్‌ గారాలపట్టి ఐరా ఆయన కోసం స్పెషల్‌గా బర్త్‌డే కేక్‌ తయారు చేయడంలో పాల్గొంది. దీనికి సంబంధించిన వీడియోను ఆయన సతీమణి రాధిక.. యశ్‌ ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. ‘హాయ్‌ స్వీట్స్‌.. హ్యాపీ బర్త్‌డే. ప్రతి సంవత్సరం నీ పుట్టినరోజున కేక్‌ తయారుచేస్తున్నాను. కానీ ఈ ఏడాది నాతోపాటు మరో వ్యక్తి కూడా కేక్‌ తయారు చేయడంలో పాల్గొంది. నీదాకా ఈ కేక్‌ వస్తుందని నేను అనుకోవడం లేదు.’ అని రాధిక  సరదాగా అన్నారు.

మరోవైపు యశ్‌ పుట్టినరోజును పురస్కరించుకుని బెంగళూరులో ఆయన అభిమానులు భారీ ఎత్తున వేడుకలు నిర్వహించారు. ఈ మేరకు వారు 5000 కేజీల భారీ కేక్‌ను తయారు చేయించి కట్‌ చేశారు. అంతేకాకుండా బర్త్‌డే సెలబ్రేషన్స్‌ జరిగే ప్రాంతంలో 216 అడుగుల కటౌట్‌ను కూడా ఏర్పాటు చేశారు. కేక్‌, కటౌట్‌ రెండు కూడా ప్రపంచ రికార్డులేనని అభిమానులు చెబుతున్నారు.

ప్రస్తుతం యశ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘కేజీఎఫ్‌2’. 2018లో వచ్చిన ‘కేజీఎఫ్‌’ చిత్రానికి రెండో భాగంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. యశ్‌ పుట్టినరోజు సందర్భంగా ‘కేజీఎఫ్‌2’ న్యూలుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని