ఇది అన్యాయం: కమల్‌హాసన్‌

ఇటీవల ప్రతిష్ఠాత్మక జవహర్‌లాల్‌ విశ్వవిద్యాలయంలో జరిగిన ఘటనపై అటు రాజకీయ ప్రముఖులతోపాటు, ఇటు సినీరంగానికి చెందిన నటీనటులు కూడా స్పందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ దాడి గురించి కమల్‌ హాసన్‌ స్పందించారు. గత కొంతకాలం క్రితం రాజకీయాల్లోకి...

Published : 10 Jan 2020 22:11 IST

జేఎన్‌యూ దాడిపై విశ్వనటుడు వ్యాఖ్య

చెన్నై: ఇటీవల ప్రతిష్ఠాత్మక జవహర్‌లాల్‌ విశ్వవిద్యాలయంలో జరిగిన ఘటనపై అటు రాజకీయ ప్రముఖులతో పాటు, ఇటు సినీరంగానికి చెందిన నటీనటులు కూడా స్పందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ దాడి గురించి కమల్‌ హాసన్‌ స్పందించారు. కొంతకాలం క్రితం రాజకీయాల్లోకి వచ్చిన కమల్‌.. తాజాగా తమిళనాడు రాష్ట్ర అభివృద్ధి గురించి ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆయన తమిళనాడు రాష్ట్ర అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని, అలాగే ప్రతి ఒక్కరూ కూడా తమ వంతు కృషి అందించాలని కోరారు.

అనంతరం ఆయన జేఎన్‌యూ దాడి గురించి మాట్లాడుతూ విద్యార్థులపై అలాంటి దాడులు జరగడం అన్యాయమని తెలిపారు. ‘ఇలాంటి దాడులు గురించి వింటుంటే చాలా బాధగా ఉంటుంది. విద్యార్థులపై ఇలాంటి దాడులు జరగడం భయానికి గురి చేస్తోంది. ఇది అన్యాయం. దీని గురించి నేనింకా చాలా మాట్లాడాలి. ఇప్పటికైనా పరిస్థితులు మారాలి. నియంతృత్వ భావాలు నశించాలి.’ అని కమల్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు