మహేశ్‌, బన్నీ చిత్రాల టికెట్‌ రేట్లు పెంపు

సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో సందడి చేసేందుకు ‘సరిలేరు నీకెవ్వరు’ అంటూ మహేశ్‌బాబు, ‘అల వైకుంఠపురములో’ అంటూ అల్లు అర్జున్‌లు వస్తున్న సంగతి

Published : 10 Jan 2020 18:37 IST

హైదరాబాద్‌: సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో సందడి చేసేందుకు ‘సరిలేరు నీకెవ్వరు’ అంటూ మహేశ్‌బాబు, ‘అల వైకుంఠపురములో’ అంటూ అల్లు అర్జున్‌లు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాల ప్రత్యేక ప్రదర్శనకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది. తెలంగాణలో శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్‌కు ఉదయం 7 గంటల నుంచి ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల వైకుంఠపురములో’ చిత్రాల స్పెషల్‌ షోలు వేసేందుకు అధికారులు ఓకే చెప్పారు. మహేశ్‌బాబు సినిమాకు రేపటి నుంచి ఈనెల 24 వరకూ, బన్ని సినిమాను 12వ తేదీ నుంచి 25 వరకూ ఐదో ఆటకు పచ్చ జెండా ఊపారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో రెండు చిత్రాల టికెట్ల ధరలను పెంచారు. పెరిగిన టికెట్‌ ధరలు వారం రోజుల పాటు కొనసాగుతాయి. అయితే, ఎంత మొత్తంలో టికెట్‌ రేటు పెంచారన్నది తెలియాల్సి ఉంది. 

అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో మహేశ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక కథానాయిక. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక అల్లు అర్జున్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘అల వైకుంఠపురములో..’  పూజా హెగ్డే కథానాయిక. ఇది జనవరి 12న విడుదల కానుంది. Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని