ఇలాంటి హీరో నెవర్‌ బిఫోర్‌ ఎవర్‌ ఆఫ్టర్‌..!

టాలీవుడ్‌లో సంక్రాంతి సెలబ్రేషన్స్‌ ఆరంభమయ్యాయి. సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కథానాయకుడిగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా రిలీజ్‌తో బాక్సాఫీస్‌ వద్ద సందడి నెలకొంది. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహేశ్‌ ఆర్మీ మేజర్‌ అజయ్‌ కృష్ణ పాత్రలో..

Updated : 11 Jan 2020 16:18 IST

మహేశ్‌ ‘సరిలేరు నీకెవ్వరు’కు ప్రశంసలు

హైదరాబాద్‌: టాలీవుడ్‌లో సంక్రాంతి సెలబ్రేషన్స్‌ ఆరంభమయ్యాయి. సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కథానాయకుడిగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా రిలీజ్‌తో బాక్సాఫీస్‌ వద్ద సందడి నెలకొంది. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహేశ్‌ ఆర్మీ మేజర్‌ అజయ్‌ కృష్ణ పాత్రలో కనిపించి మెప్పించారు. ఈ సినిమా చూసిన అభిమానులు ‘బొమ్మ దద్దరిల్లిపోయింది’ అని సోషల్‌మీడియా వేదికగా చిత్రబృందంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు సినీ ప్రముఖులు, కుటుంబ సభ్యులు సైతం చాలారోజుల తర్వాత మహేశ్‌ను మాస్‌ సినిమాలో చూడడం కనుల పండుగగా ఉందంటూ ట్వీట్లు పెడుతున్నారు.

‘‘సరిలేరునీకెవ్వరు’ చిత్రంలో మహేశ్‌ లుక్‌, నటన చాలా అద్భుతంగా ఉంది. చాలా రోజుల తర్వాత మహేశ్‌ను ఇలా చూడడం కనుల విందుగా ఉంది. ఇది ఒక మాస్‌ మసాలా మహేశ్‌ మ్యాజిక్‌. అనిల్‌ రావిపూడి బృందానికి కంగ్రాట్స్‌’ - హరీశ్‌ శంకర్‌

‘ఇటీవల విడుదలైన సినిమాల్లో మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ప్రతి ఫ్రేమ్‌లోనూ మహేశ్‌ను చూడడం కనుల పండుగగా ఉంది. సినిమా ఆద్యంతం అనిల్‌ రావిపూడి తన మార్క్‌ను చూపించారు. నా స్నేహితుడు అనిల్‌ సుంకరతోపాటు ఇతర చిత్రబృందానికి అభినందనలు’ - శ్రీనువైట్ల

‘‘సరిలేరునీకెవ్వరు’లో మహేశ్‌ స్టైల్‌ సూపర్‌గా ఉంది. ఇంటర్‌వెల్‌ సీన్‌లో విజయశాంతి మేడమ్‌ నటన పవర్‌ఫుల్‌గా అనిపించింది. సూటీగా చెప్పాలంటే బొమ్మ దద్దరిల్లిపోయిందమ్మా..!! బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను సొంతం చేసుకున్న చిత్రబృందానికి కంగ్రాట్స్‌’ - సుధీర్‌బాబు

‘ఇలాంటి హీరో నెవర్‌ బిఫోర్‌.. ఎవర్‌ ఆఫర్ట్‌. మహేశ్‌  నీ నటన చాలా బాగుంది. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ఆద్యంతం నాకు బాగా నచ్చింది. కంగ్రాట్స్‌ బ్రదర్‌. సంక్రాంతి నీదే.’ - మంజుల ఘట్టమనేని

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని