అతడే పెళ్లి కొడుకట.. అప్పుడే పెళ్లట..!

ఎంతో ఆరాధించే అందాల తార పెళ్లి చూడాలని ఏ అభిమానికి ఉండదు చెప్పండి.. ఇప్పుడిప్పుడు చిత్ర పరిశ్రమకు వచ్చిన ముద్దుగుమ్మల్ని పక్కన పెడితే.. అగ్ర నటీమణుల విషయంలో ఈ ఉత్సాహం ఇంకాస్త ఎక్కువ ఉంటుంది. అందులోనూ ప్రేమ, పెళ్లి లాంటి వ్యవహారాలంటే ఇంకాస్త....

Published : 14 Jan 2020 09:52 IST

ఎంతో ఆరాధించే అందాల తార పెళ్లి చూడాలని ఏ అభిమానికి ఉండదు చెప్పండి.. ఇప్పుడిప్పుడే చిత్ర పరిశ్రమకు వచ్చిన ముద్దుగుమ్మల విషయాన్ని పక్కన పెడితే.. అగ్ర తారల విషయంలో ఉత్సాహం ఇంకాస్త ఎక్కువ ఉంటుంది. అందులోనూ ప్రేమ, పెళ్లి లాంటి వ్యవహారాలంటే సగటు సినీ ప్రేక్షకుడికి ఆసక్తి ఎక్కువైపోతుంది. ఫలానా కథానాయిక పెళ్లి అనడం ఆలస్యం పెళ్లి కొడుకు ఎవరు? పెళ్లి ఎప్పుడు? ఏం చేస్తాడు?.. అంటూ రకరకాల ప్రశ్నలు. సోషల్‌మీడియా వినియోగం ఎక్కువైన తర్వాత ఇలాంటి వదంతులు వేగంగా పాకిపోతున్నాయి. ఓ పక్క నటీమణులు కెరీర్‌, సరైన వ్యక్తి దొరకలేదంటూ పెళ్లిని పక్కనపెడుతున్నారు. మరోపక్కేమో వారి ప్రమేయం లేకుండానే వదంతులు, ప్రచారాలు జరిగిపోతున్నాయి. కొందరు చూసీ, చూడనట్లు వదిలేస్తుంటే.. ఇంకొందరేమో స్పందిస్తున్నారు. 2020లో ఏ బ్యూటీ పెళ్లి కబురు చెబుతుందో చూడాలి. ఇలా దక్షిణాదిలో స్టిల్‌ బ్యాచ్‌లర్‌గా ఉన్న వారు, వారి పెళ్లిపై వచ్చిన వదంతుల్ని చూద్దాం..

స్వీటీ స్వీట్‌ కబురు చెబుతుందా?

గ్ర కథానాయికగా టాప్‌ రేంజ్‌లో ఉన్న స్వీటీ వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచుకోవడానికే ఇష్టపడుతుంటారు. 2005లో ‘సూపర్’తో అరంగేట్రం చేసిన ఆమె నేడు స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్నారు. 38 ఏళ్లు పూర్తయినా ఇంకా పెళ్లి ఊసే ఎత్తడం లేదు. దీంతో అనుష్క పెళ్లి కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఆమె, ప్రభాస్‌ ప్రేమలో ఉన్నారని వార్తలు వచ్చాయి. కానీ, వాటిని ప్రభాస్‌ ఖండించారు. అనుష్క మాత్రం స్పందించలేదు. అయితే పెళ్లి గురించి ఆమెను ప్రశ్నించగా... ‘వివాహంపై నాకు నమ్మకం ఉంది. నాకు నచ్చిన వ్యక్తి కంటపడినప్పుడు, సమయం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటా. నాకు పిల్లలంటే ఇష్టమే. కానీ, కేవలం ఒత్తిడి ఉందన్న కారణంతో వివాహం చేసుకోను’ అని చెప్పారు.

‘విఘ్నా’లు లేని నయన్‌ ప్రేమ

లేడీ సూపర్‌స్టార్‌గా అందరి మన్ననలు పొందుతున్న నయన్‌ జీవితంలో రెండు విఫల ప్రేమకథలు ఉన్నాయి. పరస్పర నమ్మకం లేని కారణంగా వారితో విడిపోయినట్లు ఆమే స్వయంగా చెప్పారు. కెరీర్‌ ఆరంభంలో నయన్‌ శింబును ప్రేమించినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆయనతో విడిపోయారు. తర్వాత ప్రభుదేవాకు దగ్గరయ్యారు. కానీ, కొన్ని కారణాల వల్ల ఆయనకూ దూరమయ్యారు. గత కొన్నేళ్లుగా దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌తో ఆమె ప్రేమలో ఉన్నారు. ఇద్దరూ కలిసి తీసుకున్న ఫొటోల్ని సోషల్‌మీడియాలో కూడా షేర్‌ చేస్తుంటారు. ఇటీవల ఓ అవార్డుల వేడుకలో 35 ఏళ్ల నయన్‌ మాట్లాడుతూ.. ‘విఘ్నేశ్‌ ప్రేమతో చాలా సంతోషంగా ఉన్నా’ అన్నారు. 2020లో వీరిద్దరి పెళ్లి జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

సినిమా.. సినిమా.. సినిమా

ళ్లు గడిచినా త్రిషకున్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ మాత్రం తగ్గలేదు. 35 ఏళ్ల వయసులోనూ అంతే అందంగా కనిపిస్తున్నారు. 2015 జనవరిలో ఆమె ఓ వ్యాపారవేత్తను నిశ్చితార్థం చేసుకున్నారు. కానీ, ఆ తర్వాత దాన్ని రద్దు చేసుకున్నారు. పెళ్లి తర్వాత నటించకూడదని, సినిమాలకు దూరంగా ఉండాలని కాబోయే భర్త షరతు పెట్టడంతో నిశ్చితార్థం రద్దు చేసుకున్నట్లు త్రిష ఓసారి అన్నారు. ప్రస్తుతానికి సింగిల్‌గా ఉన్నానని, ఇలానే సంతోషంగా ఉందని చెప్పారామె.

‘చందమామ’ పెళ్లి కబురు చెబుతావమ్మా..!

34 ఏళ్ల చందమామ కాజల్‌ కూడా సింగిల్‌ లైఫ్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. ఓసారి ఫ్యాన్‌ ట్విటర్‌లో పెళ్లి గురించి ప్రశ్నిస్తే.. ‘వివాహ బంధం మీద నాకు నమ్మకం ఉంది. చేసుకోవాలనుకున్నప్పుడు నేనే ప్రకటిస్తాను’ అని అన్నారు. మరోపక్క కాజల్‌ పెళ్లికి ఆమె ఇంట్లో సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, ఓ వ్యాపారవేత్తను వివాహం చేసుకోబోతున్నారని కూడా సోషల్‌మీడియా కోడై కూస్తోంది. కానీ వీటిపై కాజల్‌ స్పందించలేదు.

మిల్కీ బ్యూటీ కోసం అబ్బాయిని చూస్తున్నారట

మిల్కీబ్యూటీ తమన్నా (30) ఓ వ్యాపారవేత్తను పెళ్లాడబోతున్నారని చెప్పుకొచ్చారు. ముందు ఈ వార్తల్ని చూసీ చూడనట్టుగా వదిలేసిన ఆమె, అవి కాస్త తీవ్రరూపం దాల్చేసరికి గట్టిగా సమాధానం ఇచ్చారు. ‘పెళ్లి చేసుకుంటే అందరికీ చెప్పే చేసుకుంటా. అంతే తప్ప.. ఇలా తప్పుడు వార్తలు రాయొద్దు’ అని అన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాత్రం ‘మా అమ్మ నా కోసం అబ్బాయిని చూస్తోంది’ అని చెప్పారు. దీంతో మళ్లీ ఆమె పెళ్లిపై ప్రచారం జోరందుకుంది.

అప్పుడు చేసుకుంటానన్న తాప్సీ

డెన్మార్క్‌కు చెందిన బ్యాడ్మింటన్‌ ఆటగాడితో తాప్సి ప్రేమలో ఉన్నారని చాలా ఏళ్లుగా అంటున్నారు. వీరిద్దరూ పలు సందర్భాల్లో కలిసి కనిపించారు. కాగా పెళ్లి గురించి తాప్సిని ప్రశ్నించగా ‘పిల్లలు కావాలి అనుకున్నప్పుడు చేసుకుంటాను’ అని ఓ సారి అన్నారు. ఆమె నిశ్చితార్థం జరిగిందని వార్తలు రావడంతో.. ‘నా నిశ్చితార్థానికి నన్ను పిలవడం మర్చిపోకండి’ అంటూ చురకలించేలా స్పందించింది 32 ఏళ్ల నటి.

శ్రుతి హాసన్‌ సినిమానే ప్యాషన్‌

హాసన్‌ కుట్టి శ్రుతి వివాహం అనేక సార్లు హాట్‌ టాపిక్‌ అయ్యింది. ఆమె యూరప్‌కు చెందిన మైఖెల్‌ కోర్సేల్‌తో ప్రేమలో ఉన్నారు. ఈ క్రమంలో శ్రుతి పెళ్లిపై అనేక వార్తలు వచ్చాయి. మైఖెల్‌ ఓ సారి చెన్నై వచ్చి కమల్‌ హాసన్‌ను కలవడంతో ఇదంతా నిజమేనని అందరూ భావించారు. కానీ వీరు విడిపోయారట. ఈ విషయాన్ని మైఖెల్‌ వెల్లడించారు. 33 ఏళ్ల శ్రుతి కూడా గత కొన్ని రోజులుగా ఆయనకు దూరంగా ఉంటూ.. సినిమాలపై ఫోకస్‌ పెట్టారు.

ఇలియానా చెప్పలేదే..

లియానాకు పెళ్లి జరిగిపోయిందని అనేకసార్లు కథనాలు రాశారు. ఆమె ఆస్ట్రేలియాకు చెందిన ఫొటోగ్రాఫర్‌ ఆండ్రూనీబోన్‌తో సన్నిహితంగా ఉన్న అనేక ఫొటోల్ని కూడా షేర్‌ చేశారు. ఆయన కూడా ఇలియానాపై ప్రేమను వ్యక్తం చేస్తూ పోస్ట్‌లు చేశారు. ఈ క్రమంలో ఓ సారి ఇలియనా ఆయన్ను ‘నా భర్త’ అని సంబోధించారు. దీంతో రహస్యంగా ఇద్దరు ఒక్కటైపోయారని కూడా అన్నారు. దీని గురించి ఇలియానాను ప్రశ్నించగా.. వ్యక్తిగత జీవితం గురించి పబ్లిక్‌గా మాట్లాడటం ఇష్టం లేదని చెప్పి తప్పుకొన్నారు. 

 

-ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం
 

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని