కొత్త ఏడాది... టాలీవుడ్‌ ఆరంభం అదిరింది!

కొత్త ఏడాది టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమకు బాగా కలిసి వచ్చిందని స్టార్స్‌ అభిప్రాయపడ్డారు. ఒక్కరోజు తేడాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల వైకుంఠపురములో..’ సినిమాలు హిట్లు అందుకున్నాయి. రెండు సినిమాలూ విమర్శకులు, ప్రముఖుల ప్రశంసలు పొందాయి.....

Published : 13 Jan 2020 23:06 IST

నాని, సమంత కామెంట్లు

హైదరాబాద్‌: కొత్త ఏడాది టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమకు బాగా కలిసి వచ్చిందని స్టార్స్‌ అభిప్రాయపడ్డారు. ఒక్కరోజు తేడాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల వైకుంఠపురములో..’ సినిమాలు హిట్లు అందుకున్నాయి. రెండు సినిమాలూ విమర్శకులు, ప్రముఖుల ప్రశంసలు పొందాయి. ఈ నేపథ్యంలో సమంత, నాని ట్వీట్‌ చేశారు. ‘తెలుగు చిత్ర పరిశ్రమ బంగారు రోజులు మనపైనే ఆధారపడి ఉన్నాయి. ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల వైకుంఠపురములో..’తో 2020 గొప్పగా ఆరంభమైంది. రెండు చిత్ర బృందాలకు, ఈ సినిమా విజయంలో భాగస్వాములైన అభిమానులకు శుభాకాంక్షలు’ అని సామ్‌ ట్వీట్‌ చేశారు.

‘ఓపెనింగ్‌ బ్యాట్స్‌మెన్‌ అదరగొట్టాడు. ఈ ఏడాది బాక్సాఫీసు (వసూళ్లపరంగా) గొప్పగా ఉండబోతోందని మేం ప్రమాణం చేస్తున్నాం. రెండు చిత్ర బృందాలకు శుభాకాంక్షలు.. మీ తర్వాత ప్రాజెక్టులకు నా అభినందనలు’ అని నాని పోస్ట్‌ చేశారు. అంతేకాదు ఈ రెండు సినిమాలు బాక్సాఫీసు వద్ద అద్భుతమైన వసూళ్లతో రాణిస్తున్నాయి.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని