ఇదే బంధుప్రీతైతే.. అలానే అనుకోండి: బన్నీ
ప్రేక్షక దేవుళ్లకు తన జీవితం అంకితమని, వారికి వినోదం పంచడమే తన బాధ్యతని కథానాయకుడు అల్లు అర్జున్ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘అల వైకుంఠపురములో..’ సినిమా థ్యాంక్స్ మీట్లో ఆయన మాట్లాడారు. తన సినిమా గురించి, చిత్ర పరిశ్రమలో ‘బంధుప్రీతి’ .....
దర్శకుడు పర్ఫెక్ట్గా లేకపోతే శవాన్ని అలంకరించినట్లే..!
మాకు జీవం పోసేది ఆయనే
హైదరాబాద్: ప్రేక్షక దేవుళ్లకు తన జీవితం అంకితమని, వారికి వినోదం పంచడమే తన బాధ్యతని కథానాయకుడు అల్లు అర్జున్ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘అల వైకుంఠపురములో..’ సినిమా థ్యాంక్స్ మీట్లో ఆయన మాట్లాడారు. తన సినిమా గురించి, చిత్ర పరిశ్రమలో ‘బంధుప్రీతి’ గురించి ముచ్చటించారు. ‘ఒక ఏడాదిన్నర ముందు నా తర్వాతి సినిమా కోసం కాస్త ఓపికగా ఉండమని ట్వీట్ చేశా. చెప్పినట్లే ఓ మంచి సినిమాతో మీ ముందుకొచ్చా. ‘చెప్పిమరీ హిట్టు కొట్టాడు.. వీడు మగాడ్రా బుజ్జి’ అని నిన్న ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఈ సినిమా కోసం అందరూ చాలా కష్టపడ్డారు. నేను ‘ఆర్య’ సినిమా నుంచి ఇప్పటి వరకు దాదాపు 20 చిత్రాలు చేశా. నా సినిమాల్లోని ఫైట్లను చాలా మంది ఇష్టపడుతుంటారు. దానికి కారణం రామలక్ష్మణ మాస్టర్లు. నాకు వీరి వల్లే యాక్షన్ ఇమేజ్ వచ్చింది. ఇవాళ బ్రహ్మానందం గారు మా తాతయ్య గురించి మాట్లాడారు. చాలా సంతోషమేసింది. నా, సునీల్ కాంబినేషన్ సీన్‌కు థియేటర్లో రియాక్షన్ మామూలుగా లేదు. నాకు సపోర్ట్ ఇచ్చినందుకు థాంక్యూ సునీల్’.
‘కెమెరామెన్ పీఎస్ వినోద్ గారు ఈ సినిమాకు ప్రధాన బలం. ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. తమన్ నీ మ్యూజిక్ ఇష్టపడే ఓ శ్రోతను నేను. అలాంటిది నా సినిమా ద్వారా నువ్వు కిరీటం పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉంది. నువ్వు ఎంతో కష్టపడతావు. అదంతా ఒకే ఆల్బమ్‌లో రావడం గొప్ప. మా బావ నవదీప్.. బిగ్‌బాస్‌లో ఉన్నా, పబ్‌లో ఉన్నా, అమ్మాయితో ఉన్నా, షూట్లో ఉన్నా, సక్సెస్ పార్టీలో ఉన్నా, ఒక్కడే ఉన్నా.. ఒకే వైబ్‌లో ఉంటాడు (నవ్వుతూ)’.
‘మా (రాజేంద్ర ప్రసాద్‌తో) కాంబినేషన్ ‘జులాయి’తో మొదలైంది. ‘సన్నాఫ్ సత్యమూర్తి’తో పెరిగింది, ‘అల వైకుంఠపురములో..’తో నిలబడిపోవడం చాలా ఆనందంగా ఉంది. హ్యాట్రిక్ కొట్టిన మా రాజేంద్ర ప్రసాద్‌తో మరో హిట్ కొట్టాం. సుశాంత్ కథ వినకుండా చిత్రం ఓకే చేశాడు. అతడు చేసిన ఒక్క మూమెంట్‌కు అందరూ క్లాప్స్ కొడితే చాలు అనుకున్నా. చివరి సీన్లో అతడి డైలాగ్‌కు మంచి స్పందన వచ్చింది. అతడు సినిమా చేయాలని కోరుకున్నా.. ఒప్పుకున్నందుకు పేరు రావాలి అనుకున్నా. ఈ రెండూ రావడం చాలా హ్యాపీ’.
‘రాధాకృష్ణ గొప్ప నిర్మాత. నాకు ఓ స్థాయి రావాలి అనుకున్న వ్యక్తి ఆయన. ఇక మా నాన్న గురించి చెప్పాలి (నవ్వులు). కచ్చితంగా ప్రీ రిలీజ్ వేడుకలా ఇక్కడ భావోద్వేగానికి గురికాను.. సమస్యే లేదు. ఈ సినిమాతో ఆయనకు బాగా డబ్బులు రావాలి. ఇప్పుడున్న ఇంటిలో స్విమ్మింగ్‌పుల్ కట్టించడమే కాదు.. నేను కట్టుకోబోయే కొత్త ఇంటిలో కూడా కట్టించాలని కోరుకుంటున్నా. ఆయనకు వచ్చిన లాభాల్లో నాకు వాటా ఇవ్వాలి. నీకు డబ్బులు రావాలి డాడీ (నవ్వుతూ). ఇప్పటికే చాలా వస్తోందని అర్థమైంది. మనం మళ్లీ ఇంటికి వెళ్లి మాట్లాడుకుందాం.. స్నేహాతో కలిసి డ్రామా చేసి డబ్బులు లాగేస్తాను (నవ్వుతూ). నాకు ఇష్టమైన మురళీ శర్మ గారు ఈ సినిమాలో ఎంతో బాగా నటించారు. ఈశ్వరీ, రోహిణి, టబు, నివేదా పేతురాజ్‌లు కూడా బాగా చేశారు. వీరికి, పూజకు థ్యాంక్స్. నేను ‘డీజే: దువ్వాడ జగన్నాథమ్’లో పూజ నటించినప్పుడు అమ్మాయి బాగా నటిస్తోంది అనుకున్నా. నా కెరీర్లో తొలిసారి ఓ హీరోయిన్ను రిపీట్ చేశా. ఈ సినిమా చూసిన తర్వాత మరోసారి రిపీట్ చేసినా తప్పులేదు అనిపించింది’.
‘నా గత చిత్రం తర్వాత ఓ ఎంటర్టైనర్ సినిమా చేయాలి అనుకున్నా. ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నప్పుడు.. త్రివిక్రమ్ గారు మాత్రమే గుర్తొచ్చారు. నేను, త్రివిక్రమ్ మంచి మైండ్‌సెట్‌తో ఉంటే చాలు.. మంచి సినిమా చేస్తాం అనుకున్నా. ఆయన్ను కలిశా, మనం సరదాగా సినిమా చేద్దాం అన్నా. అదే నమ్మాం, అలానే చేశాం, అదే రెస్పాన్స్ వచ్చింది. టెక్నీషియన్స్ బాగా పనిచేయొచ్చు, నటీనటులు బాగా నటించొచ్చు, ఆడియో బ్లాక్‌బస్టర్ కావొచ్చు.. అన్నీ చేసి డైరెక్షన్ బాగా లేకపోతే శవాన్ని అలంకరించినట్లు ఉంటుంది. ఎంత అలంకరిస్తే అంత అసహ్యంగా ఉంటుంది. వీటన్నింటికీ లైఫ్ ఇచ్చేది మాత్రం దర్శకుడే. అలాంటి మా అందరికీ జీవితం ఇచ్చిన త్రివిక్రమ్‌కు థాంక్యూ. ఇది మన హ్యాట్రిక్’.
‘మొన్న ఓ ఇంటర్వ్యూలో బంధు ప్రీతి గురించి నన్ను అడిగారు. ఒకే కుటుంబంలోని వారు కొనసాగడమే ఇది. ఓ పూజారి తన జీవితాన్ని దేవుడికి అంకితం చేస్తాడు. ఆయన కొడుకు, మనవడు కూడా చేస్తారు. మేము కూడా అలాగే.. ప్రేక్షక దేవుళ్లకు మా జీవితం అంకితం చేస్తున్నాం. మా తాత చేశారు, మా నాన్న చేశారు, నేను చేస్తాను. దీన్ని బంధు ప్రీతి అనుకుంటే.. అలానే అనుకోండి. ఇక్కడ తెలుగు ప్రేక్షకులకు వినోదం పంచడం కోసమే మేం ఉన్నాం’ అని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్‌తో కృతి సనన్
సినీ తారలు సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ పొలిటికల్ పార్టీల తరఫున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. -
సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్.. కారణమిదేనా!
దీపికా పదుకొణెకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె సినిమాలకు బ్రేక్ తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
వారిద్దరు టామ్ అండ్ జెర్రీలా.. మెగా, మంచు ఫ్యామిలీలపై మనోజ్ డైలాగ్
రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలకు హీరో మంచు మనోజ్ తదితరులు అతిథులుగా హాజరై, సందడి చేశారు. -
జాన్వీతో రామ్ చరణ్ సినిమా.. ఏడేళ్ల క్రితమే కోరిక బయటపెట్టిన చిరంజీవి
రామ్ చరణ్- జాన్వీ కపూర్ కలిసి సినిమా చేయాలని చిరంజీవి ఏడేళ్ల క్రితమే కోరుకున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని బయటపెట్టారు. -
వరుస పరాజయాలతో నిద్రలేని రాత్రులు.. నేను కాబట్టి తట్టుకోగలిగా: స్టార్ హీరోయిన్
దాదాపు 25 ఏళ్ల సినీ కెరీర్లో తాను ఎదుర్కొన్న ఇబ్బందులపై బాలీవుడ్ నటి కరీనా కపూర్ (Kareena Kapoor) స్పందించారు. కెరీర్ ఆరంభంలో ఎన్నో ప్రశంసలు అందుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద విజయం అందుకోవడానికి అవి ఏమాత్రం ఉపయోగపడలేదన్నారు. -
‘ఇదొక అద్భుతమైన చిత్రం.. ప్రేక్షకులు తప్పక సపోర్ట్ చేయాలి’ - కమల్ హాసన్
పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రలో నటించిన ‘ఆడు జీవితం’(Aadujeevitham)పై అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) ప్రశంసల వర్షం కురిపించారు. -
వివాహ బంధంలోకి సిద్ధార్థ్ - అదితి రావు
నటుడు సిద్ధార్థ్ (Siddharth) అదితిరావు హైదరీ (Aditi Rao Hydari)ని వివాహం చేసుకున్నారు. -
రామ్‌చరణ్ బర్త్‌డే.. భక్తులకు సురేఖ అన్నదానం
నటుడు రామ్‌చరణ్ (Ram Charan) పుట్టినరోజు నేడు. ఈ వేడుకలను ఆయన తల్లి సురేఖ ప్రత్యేకంగా సెలబ్రేట్ చేశారు. -
లండన్‌లో ఇల్లు కొన్న ప్రభాస్..?
ప్రభాస్(prabhas)కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం నెట్టింట వైరల్‌గా మారింది. విలాసవంతమైన ఇంటిని ఆయన కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. -
11 మంది హీరోలను పరిచయం చేయనున్న నిహారిక!
నిహారిక నిర్మిస్తోన్న ఓ సినిమాతో ఇండస్ట్రీకి 11 మంది హీరోలుగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. -
నయనతార, ప్రియాంక చోప్రా ఫ్యామిలీ పిక్స్.. మిర్నా హొయలు.. రాశీసింగ్ మెరుపులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఇప్పుడు బెంగళూరులో.. రేపు ఎక్కడైనా: నీటి విలువపై చిరంజీవి పోస్ట్
బెంగళూరు నీటి సమస్యపై ప్రముఖ హీరో చిరంజీవి స్పందించారు. -
Naga Vamsi: పెద్ద హీరోల సినిమాల్లో లాజిక్‌లు చూడొద్దు: నాగవంశీ
సినిమాను వినోదం కోసం మాత్రమే చూడాలని నిర్మాత నాగవంశీ అన్నారు. ‘గుంటూరు కారం’ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యాక దాన్ని చాలా మంది మెచ్చుకొన్నారని తెలిపారు. -
Tillu Square: తెరపై హాట్‌గా కనిపించడం చాలా కష్టం: అనుపమ పరమేశ్వరన్
స్క్రీన్‌పై హాట్‌గా కనిపించడం చాలా కష్టమని నటి అనుపమ పరమేశ్వరన్ అన్నారు. ‘టిల్లు స్క్వేర్’ ప్రమోషన్స్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. -
Vijay Deverakonda: ఇప్పటికీ సర్దుకుపోతుంటా: విజయ్ దేవరకొండ
తన కొత్త సినిమా ‘ఫ్యామిలీస్టార్’ ప్రచారంలో భాగంగా యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చారు విజయ్ దేవరకొండ. ఆ విశేషాలివీ.. -
Social Look: హోలీ స్పెషల్.. రష్మిక వర్కింగ్.. ఫ్యామిలీతో కియారా.. పాయల్, కాజల్ ఇలా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
Shruti Haasan: ప్రేమించడం ఒక భ్రమని నమ్ముతున్నా: శృతిహాసన్
హీరోయిన్ శృతిహాసన్ తాను నటించిన ‘ఇనిమేల్’ పాట గురించి తెలిపారు. -
Triptii Dimri: అలా కెరీర్ ప్రారంభించాలంటే ధైర్యం కావాలి: త్రిప్తి డిమ్రి
నటి ప్రియాంక చోప్రా అంటే తనకెంతో ఇష్టమని త్రిప్తి డిమ్రి మరోసారి వెల్లడించారు. -
siddhu jonnalagadda: మంచి కథలు నా వద్దకు వచ్చేవి కాదు: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ విడుదల నేపథ్యంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడారు. -
Vijay Devarakonda: హోలీ సంబరాల్లో ‘ఫ్యామిలీ స్టార్’ టీమ్.. డ్యాన్స్‌తో అలరించిన మృణాల్
‘ఫ్యామిలీ స్టార్’గా పలకరించేందుకు విజయ్ దేవరకొండ సిద్ధమయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్‌లో నమోదైన రికార్డులివీ..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్‌తో కృతి సనన్
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
-
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
-
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా