రూ.150కోట్ల క్లబ్‌లో ‘దర్బార్‌’

సాధారణంగా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సినిమా ఎప్పుడు విడుదలైనా థియేటర్ల వద్ద పండగ వాతావరణమే. అదే ఆయన సినిమా పండగ సందర్భంగా విడుదలైతే ఆ హంగామే వేరు. మురగదాస్‌ దర్శకత్వంలో.........

Published : 13 Jan 2020 21:33 IST

చెన్నై: సాధారణంగా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సినిమా ఎప్పుడు విడుదలైనా థియేటర్ల వద్ద పండగ వాతావరణమే. అదే ఆయన సినిమా పండగ సందర్భంగా విడుదలైతే ఆ హంగామే వేరు. మురగదాస్‌ దర్శకత్వంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం దర్బార్‌. సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. కలెక్షన్ల పరంగానూ రికార్డుల వేటలో దూసుకెళుతోంది. ఈ ఏడాది విడుదలైన మొదటి పాన్‌ ఇండియా మూవీ ఇదే. అయితే, మొదటి ఐదు రోజుల్లోనే రూ.150కోట్లు వసూళ్లు రాబట్టుకొంది. ఈ సందర్భంగా సినిమా నిర్మాణ సంస్థ తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. ‘ఆట ఎవరైనా ఆడతారు.. కానీ సింహాసనం మాత్రం రాజుకే దక్కుతుంది.. ఇదిగో దర్బార్‌ వరల్డ్‌వైడ్‌ కలెక్షన్లు’ అంటూ రాసుకొచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నయనతార, ప్రతినాయకుడిగా సునీల్‌ శెట్టి, కీలక పాత్రలో నివేథ థామస్‌ కనిపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని