చైతన్య చొక్కా పట్టుకుంటే సామ్‌ ఊరుకుంటుందా??

తన భర్త నాగచైతన్య చొక్కా ఎవరైనా పట్టుకుంటే సమంత ఒప్పుకుంటారా? సమస్యే లేదు. కానీ సినిమా కోసమైతే తప్పదు కదా.. చైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న సినిమా ‘లవ్‌స్టోరీ’. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో సాయిపల్లవి.. చైతన్య చొక్కాపట్టుకుని....

Published : 16 Jan 2020 04:47 IST

హైదరాబాద్‌: తన భర్త నాగచైతన్య చొక్కా ఎవరైనా పట్టుకుంటే సమంత ఒప్పుకుంటారా?.. సమస్యే లేదు. కానీ సినిమా కోసమైతే తప్పదు కదా.. చైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న సినిమా ‘లవ్‌స్టోరీ’. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో సాయిపల్లవి.. చైతన్య చొక్కాపట్టుకుని లాగుతూ కనిపించారు. భావోద్వేగంతో కూడుకున్న ఈ ప్రచార చిత్రం అభిమానుల్ని ఆకట్టుకుంది. కాగా ఈ పోస్టర్‌ను సామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. దీంతోపాటు ఇంటర్నెట్‌లో దొరికిన ఓ సరదా మీమ్‌ కూడా పంచుకున్నారు. అందులో బ్రహ్మానందం కత్తిపట్టుకుని.. ‘వదులు షర్ట్‌ వదులు..’ అని సాయిపల్లవిని బెదిరిస్తున్నట్లు ఉంది. ప్రస్తుతం అది సమంత ఫీలింగ్‌ అట. ఈ మీమ్‌ను సామ్‌ ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేస్తూ.. ‘అవును’ అంటూ జిఫ్‌ పోస్ట్‌ చేశారు. ఆమె సరదా పోస్ట్‌ సోషల్‌మీడియాలో నెటిజన్లను నవ్వించింది.

‘లవ్‌స్టోరీ’ సినిమాకు శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. వేసవిలో చిత్రం విడుదల కాబోతోంది. ‘ఓ బేబీ’ తర్వాత సామ్‌ ‘మన్మథుడు 2’లో అతిథిగా కనిపించారు. ప్రస్తుతం ‘జాను’లో నటిస్తున్నారు. శర్వానంద్‌ కథానాయకుడు. తమిళ హిట్‌ ‘96’కు తెలుగు రీమేక్‌గా ఇది రూపొందుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని