‘రమణా.. లోడు ఎత్తాలిరా..’ ఒక్క డైలాగ్‌తో ఫేమస్‌!

సినిమా.. ఒక్క రోజులో జీవితాలను మార్చేస్తుంది. నిన్నటి వరకూ ఎవరికీ తెలియని వ్యక్తులు రేపు స్టార్‌లుగా ఎదగవచ్చు. ప్రస్తుతం స్టార్‌ స్టేటస్‌ అనుభవిస్తున్న వారు కాలగమనంలో కలిసిపోవచ్చు.

Published : 20 Jan 2020 09:32 IST

సినిమా.. ఒక్క రోజులో జీవితాలను మార్చేస్తుంది. నిన్నటి వరకూ ఎవరికీ తెలియని వ్యక్తులు రేపు స్టార్‌లుగా ఎదగవచ్చు. ప్రస్తుతం స్టార్‌ స్టేటస్‌ అనుభవిస్తున్న వారు కాలగమనంలో కలిసిపోవచ్చు. చరిత్ర పుటల్ని తిరగేస్తే అలాంటి సంఘటనలు ఎన్నో. ఇక ‘ఒక్క ఛాన్స్‌’ కోసం ఎదురు చూసే వాళ్లెందరో. ఛాన్సులు వస్తున్నా, కష్టపడినా సరైన విజయాలు లేక గుర్తింపు కోసం తాపత్రయ పడేవాళ్లు ఇంకెందరో. కానీ, ఒక్క సినిమా, ఒక్క డైలాగ్‌తో జీవితాలు మారిపోయిన నటులు కొందరున్నారు. ఆలీ ‘చాట కథ’ నుంచి ప్రియదర్శి ‘నా చావు నేను ఛస్తా’ వరకూ ఎందరో అలా పేరు తెచ్చుకున్నవాళ్లే. ఇప్పుడు ఆ జాబితాలోకి చేరారు కుమనన్‌ సేతు రామన్‌. 

హేశ్‌బాబు కథానాయకుడిగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో ‘రమణా.. లోడు ఎత్తాలిరా.. చెక్‌పోస్ట్‌ పడతాది’ అంటూ ఒక్క డైలాగ్‌తో మంచి క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు కుమనన్‌. అలాగని ఆయన ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన నటుడేమీ కాదు. దాదాపు 20 ఏళ్లుగా సినీ పరిశ్రమలోనే కొనసాగుతున్నారు. పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించారు. అయితే, ఇన్నేళ్లకు ఒక్క డైలాగ్‌తో ఆయనకు ఎనలేని గుర్తింపు వచ్చింది. అలాంటి సేతురామన్‌ గురించి ఆసక్తికర విషయాలు మీకోసం..

కుమనన్‌ సేతురామన్‌ టాలీవుడ్‌కు రాకముందు ఓ కంపెనీలో సర్వీస్‌ ఇంజినీర్‌గా పనిచేసేవారు. ఆ తర్వాత సినిమాలపై ఆసక్తితో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి, స్టిల్‌ ఫొటో గ్రాఫర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. 

సమయంలోనే అనేకమంది తారలను ఫొటోలు తీసే అవకాశం వచ్చింది. అలా ఇండస్ట్రీలో అందరితోనూ పరిచయం ఏర్పడింది. 

‘మేఘం’ సినిమాకు స్టిల్‌ ఫొటో గ్రాఫర్‌గా పనిచేస్తున్న సేతురామన్‌ను చూసి ఆయన బాడీ లాంగ్వేజ్‌ నచ్చడంతో ఆ చిత్ర దర్శకుడు అందులో విలన్‌కు సహాయకుడిగా నటించే అవకాశం ఇచ్చారు.

ప్పటి నుంచి స్టిల్‌ ఫొటో గ్రాఫర్‌గా కొనసాగుతూనే మరో వైపు నటుడిగా రవితేజ ‘వెంకీ’, చిరంజీవి ‘స్టాలిన్‌’, తేజ ‘ధైర్యం’ తదితర చిత్రాల్లో  చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ వెండితెరపై మెరిశారు. 

చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి ప్రధాన సెక్యూరిటీ ఆఫీసర్‌గా సేతురామన్‌ పనిచేశారు. ఆ సమయంలోనే నిస్సహాయ స్థితిలో ఉన్న వికలాంగులను భుజంపై మోసుకుంటూ అంబులెన్స్‌లో ఎక్కించడం చూసిన పవన్‌కల్యాణ్‌ ప్రత్యేకంగా అభినందించారు.

 

రవింద్‌2’లో ప్రధాన విలన్‌గా అవకాశం రావడంతో ఇండస్ట్రీలో తానేంటో నిరూపించుకునే అవకాశం సేతురామన్‌కు లభించింది. ఆ తర్వాత వి.వి.వినాయక్‌ తెరకెక్కించిన ‘అల్లుడు శీను’ సినిమాలో బాబాగా ఆయన నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి. 

చిరంజీవి కీలక పాత్రలో సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘సైరా నరసింహారెడ్డి’లోనూ సేతురామన్‌ కనిపించారు. 

‘సరిలేరు నీకెవ్వరు’ సేతురామన్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. నల్లమలలో జరిగే ఫైట్‌ సీన్‌లో ‘రమణా.. లోడు ఎత్తాలిరా.. చెక్‌పోస్ట్‌ పడతాది’ అంటూ ఆయన చెప్పిన ఒక్క డైలాగ్‌తో ఫేమస్‌ అయిపోయారు. 

సేతురామన్‌ 60ఏళ్ల వయసులోనూ రోజులో ఐదారు గంటలు జిమ్‌లో గడుపుతారు. ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. అంతేకాదు, అప్పుడప్పుడు మోడల్‌గానూ ర్యాంప్‌పై వాక్‌ చేస్తారు.

 

‘‘ఈ పండగ సీజన్‌ మహేశ్‌బాబు దుమ్ము దులిపారు. ‘సరిలేరు నీకెవ్వరు’చిత్రంలో బాగా చేశానని నా వాట్సాప్‌ సందేశాలతో నిండిపోతోంది. దీనికి కారణం దర్శకుడు అనిల్‌ రావిపూడి. ఎందుకంటే, గత 20ఏళ్లుగా కష్టపడుతున్నా, నన్ను ఇంతలా ఎవరూ గుర్తించేలా చేయలేకపోయారు. ఒక్క డైలాగ్‌తో ఆకాశంలో ఎత్తుకు తీసుకెళ్లారు. ప్రేక్షకులు కూడా ఇంతలా ఆదరించి, నన్ను పైకి తీసుకొస్తారని ఊహించలేదు. ఈ డైలాగ్‌ ఇంత వైరల్‌ అవుతుందని కూడా అనుకోలేదు. సినిమా అంటే నాకు ప్రాణం. నా ఆఖరి ఊపిరున్నంతవరకూ సినిమాలో నటిస్తా. మహేశ్‌బాబుతో ఫైట్‌ సీన్‌ చేస్తుండగా నా కాలు మడత పడిపోయింది. వెంటనే ఆయన తన పర్సనల్‌ డాక్టర్‌కు ఫోన్‌ చేసి మరీ వైద్యం చేయించారు. తోటి నటుల పట్ల ఆయన చూపించే ప్రేమ, అభిమానం ఎప్పటికీ మర్చిపోలేను. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా ఆయన సోదరుడిలా నన్ను చూసుకున్నందుకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన చిత్ర బృందానికి ధన్యవాదాలు’’ -సరిలేరు నీకెవ్వరు విజయోత్సవ సభలో కుమనన్‌ సేతు రామన్‌.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని