
ఆడబిడ్డకు జన్మనిచ్చిన స్నేహ
చెన్నై: ప్రముఖ నటి స్నేహ మరోసారి తల్లయ్యారు. శుక్రవారం ఆమె పాపకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని స్నేహ భర్త ప్రముఖ తమిళ నటుడు ప్రసన్న సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తల్లీ బిడ్డా పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా స్నేహ దంపతులకు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
ఇంతకు ముందు స్నేహ దంపతులకు విహాన్ పుట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆడపిల్ల పుట్టింది. తమ ఇంటికి లక్ష్మీదేవి వచ్చిందని స్నేహ కుటుంబ సభ్యులు తెగ సంబర పడుతున్నారట. ప్రసన్న-స్నేహ 2012లో ప్రేమ విహహం చేసుకున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.