కీర్తిసురేశ్ న్యూలుక్‌.. ఫ్యాన్స్ నిరాశ

‘మహానటి’ చిత్రంతో వెండితెరపై సావిత్ర జీవితాన్ని ఆవిష్కరించి ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు నటి కీర్తి సురేశ్‌....

Published : 03 Feb 2020 18:23 IST

‘మహానటి’గానే బాగున్నారంటున్న నెటిజన్లు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘మహానటి’ చిత్రంతో వెండితెరపై సావిత్ర జీవితాన్ని ఆవిష్కరించి ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు నటి కీర్తి సురేశ్‌. ఈ బొద్దుగుమ్మను చూసి తెలుగింటి అమ్మాయిలా ఉన్నావంటూ చాలామంది మెచ్చుకున్నారు. అయితే తాజాగా ఈ నటికి సంబంధించిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ‘మహానటి’ చిత్రం తర్వాత కీర్తి సురేశ్‌ తెలుగు, తమిళ, మలయాళం సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంటున్నారు. ఆయా సినిమా కథలు డిమాండ్‌ చేయడం వల్ల కీర్తి చాలా సన్నగా మారారు. ఇదిలా ఉండగా తాజాగా ఆమె ఓ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను కీర్తి బృందం ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకుంది.

సన్నగా మారిన కీర్తిని చూసిన అభిమానులు నిరాశ చెందారు. కీర్తి న్యూలుక్ గురించి కామెంట్లు చేయడం ప్రారంభించారు. ‘కీర్తి.. మీరు బొద్దుగా ఉన్నప్పుడే చాలా అందంగా ఉన్నారు’,  ‘మీరు మహానటి లుక్‌లోనే అందంగా ఉన్నారు’, ‘మీరు మళ్లీ మహానటి లుక్‌లోకి మారిపోండి’, ‘కీర్తి.. నువ్వు ఇలా సన్నగా ఉంటే చూడలేకపోతున్నాం’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల కీర్తి సన్నగా మారిన కారణంగా ఓ బాలీవుడ్‌ ఆఫర్‌ను చేజార్చుకున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు