పెళ్లి చేసుకున్న ప్రముఖ హాస్యనటుడు

ప్రముఖ కోలీవుడ్‌ హాస్యనటుడు యోగిబాబు వివాహం చేసుకున్నారు. పెద్దల సమక్షంలో మంజు భార్గవి అనే అమ్మాయిని బుధవారం ఉదయం పరిణయమాడారు. తమిళనాడులోని.....

Updated : 05 Feb 2020 17:09 IST

చెన్నై: కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ హాస్యనటుడు యోగిబాబు వివాహం చేసుకున్నారు. పెద్దల సమక్షంలో మంజు భార్గవి అనే అమ్మాయిని బుధవారం ఉదయం పరిణయమాడారు. తమిళనాడులోని తిరుత్తణి దేవాలయంలో సంప్రదాయబద్ధంగా జరిగిన వీరి వివాహానికి కుటుంబసభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. యోగిబాబు వివాహానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో అభిమానులు, సినీ ప్రముఖులు, నెటిజన్లు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే యోగిబాబు సన్నిహితులు తెలిపిన సమాచారం ప్రకారం సినీ తారలు కోసం మార్చి నెలలో రిసెప్షన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.

2009లో తెరకెక్కిన ‘యోగి’ సినిమాతో వెండితెరకు పరిచయమైన యోగిబాబు ఎన్నో సినిమాల్లో హాస్యనటుడిగా మెప్పించారు. నయనతార కీలకపాత్రలో నటించిన ‘కో కో కోకిల’ అనే సినిమాలో యోగిబాబు ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమాలో ఆయన నయనతారను ప్రేమించే వ్యక్తిగా కనిపించి, మెప్పించారు. ఇటీవల విజయ్‌ కథానాయకుడిగా తెరెకెక్కిన ‘బిగిల్‌’, రజనీకాంత్‌ ‘దర్బార్’ సినిమాల్లో కూడా యోగిబాబు సందడి చేశారు. ధనుష్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఓ సినిమాలో యోగిబాబు నటిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని