విజయ్‌ ఇంట్లో ఐటీ సోదాలు

కోలీవుడ్‌ నటుడు విజయ్‌ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో భాగంగా వారు రూ.65 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. గతేడాది విడుదలైన ‘బిగిల్‌’ చిత్రానికి సంబంధించి పన్ను ఎగవేశారనే ఆరోపణలతో విజయ్‌...

Published : 06 Feb 2020 13:29 IST

రూ.65 కోట్లు స్వాధీనం చేసుకున్న అధికారులు

చెన్నై: కోలీవుడ్‌ నటుడు విజయ్‌, అన్బు చెళియన్‌కు చెందిన 38 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో భాగంగా వారు రూ.65 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. గతేడాది విడుదలైన ‘బిగిల్‌’ చిత్రానికి సంబంధించి పన్ను ఎగవేశారనే ఆరోపణలతో విజయ్‌ నివాసాలతోపాటు ఆ చిత్రాన్ని తెరకెక్కించిన ఏజీఎస్‌ సంస్థ కార్యాలయాలు, సంస్థకు చెందిన వ్యక్తుల ఇళ్లలోనూ బుధవారం సాయంత్రం ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అన్బు చెళియన్‌కు చెందిన సంస్థలు, మదురైలోని ఆయన నివాసంలో కూడా ఈ సోదాలు జరిగాయి. ఈ క్రమంలో రూ.65 కోట్ల సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి

విజయ్‌కు ఐటీ షాక్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని