వైభ‌వంగా కోడిరామ‌కృష్ణ చిన్న కుమార్తె వివాహం

తెలుగు చిత్ర పరిశ్రమపై చెరగని ముద్రవేసిన దర్శకుడు దివంగత దర్శకుడు కోడిరామకృష్ణ. గురువారం ఆయన చిన్నకుమార్తె ప్రవల్లిక వివాహం మహేశ్‌తో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి

Updated : 06 Feb 2020 18:58 IST

హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమపై చెరగని ముద్రవేసిన దివంగత దర్శకుడు కోడిరామకృష్ణ. గురువారం ఆయన చిన్నకుమార్తె ప్రవల్లిక వివాహం మహేశ్‌తో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

హైదరాబాద్ గండిపేట‌లోని క‌న్వెష‌న్స్ అండ్ ఎగ్జిబిష‌న్‌లో ప్రవల్లిక, మహేశ్‌ల వివాహం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. మెగాస్టార్ చిరంజీవి, నంద‌మూరి బాల‌కృష్ణ‌, మోహ‌న్ బాబు, మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాదవ్‌, మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు,  కె.రాఘ‌వేంద్ర‌రావు, ముర‌ళీ మోహ‌న్‌, గోపీచంద్‌, జ‌య‌ప్ర‌ద‌, జీవిత‌, దిల్ రాజు, కోదండ రామిరెడ్డి, కె.విజ‌య‌భాస్క‌ర్‌, బి.గోపాల్‌, అల్లు అర‌వింద్‌, ద‌ర్శ‌క నిర్మాత ఎం.ఎస్.రాజు, నంద‌మూరి రామ‌కృష్ణ‌, పోకూరి బాబూరావు, ప‌రుచూరి గోపాల‌కృష్ణ‌, దేవీప్ర‌సాద్‌, వీర‌శంక‌ర్‌, శివాజీరాజా, మారుతి, ముత్యాల సుబ్బ‌య్య‌, వినోద్‌కుమార్‌, కాశీ విశ్వ‌నాథ్‌, అలీ, హేమ‌, నాగ‌బాబు స‌తీమ‌ణి ప‌ద్మ‌జ‌, కుమార్తె నిహారిక‌, న‌టి శివ‌పార్వ‌తి, రాజ‌శేఖ‌ర్ కుమార్తె శివాని త‌దిత‌రులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజ‌రై నూతన వధూవరులను ఆశీర్వదించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని