రామ్‌చరణ్‌ను ప్రశంసించిన ఇన్ఫోసిస్‌ సుధామూర్తి

టాలీవుడ్‌ యువ కథానాయకుడు రామ్‌చరణ్‌ను ప్రముఖ రచయిత, ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ సుధామూర్తి ప్రశంసించారు. తాజాగా ఆమెను ఓ ఛానెల్‌ వారు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు. ఇందులో భాగంగా తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విశేషాలను ఆమె పంచుకున్నారు...

Updated : 09 Feb 2020 18:25 IST

హైదరాబాద్‌: టాలీవుడ్‌ యువ కథానాయకుడు రామ్‌చరణ్‌ను ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ సుధామూర్తి ప్రశంసించారు. తాజాగా ఆమెను ఓ ఛానెల్‌ వారు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు. దీనిలో ఆమె తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విశేషాలను వెల్లడించారు. అనంతరం ఆమె ఇటీవల ‘రంగస్థలం’ సినిమాను చూశానన్నారు. రామ్‌చరణ్‌ నటన అద్భుతంగా ఉందని ప్రశంసించారు. 

‘చిన్నతనంలో ఎక్కువగా రామారావు(ఎన్టీఆర్‌) సినిమాలు చూసేదానిని. ఆయన నటించిన ‘మాయాబజార్‌’, ‘దాన వీర శూర కర్ణ’, ‘సీతా స్వయంవరం’ చిత్రాలను చూశాను. మనకి కృష్ణుడు ఎలా ఉంటారో తెలియదు. కృష్ణుడిని ఎప్పుడూ చూడలేదు. కానీ, నా దృష్టిలో మాత్రం కృష్ణుడంటే ఎన్టీఆరే. ఎప్పుడైనా కళ్లు మూసుకుని కృష్ణుడిని స్మరిస్తే.. నాకు ఆయనే కనిపిస్తారు. అంతేకాకుండా.. ‘అన్నమయ్య’, ‘ఓం నమో వెంకటేశాయా’, ‘భక్త ప్రహ్లాద’ చిత్రాలను కూడా చూశాను. ఇటీవల నేను రామ్‌చరణ్‌ నటించిన ‘రంగస్థలం’ సినిమాను వీక్షించాను. ఆ సినిమా చాలా బాగుంది. రామ్‌చరణ్‌ నటన అద్భుతంగా ఉంది. వీటితోపాటు ‘మనం’ కూడా చూశాను. అలాగే కన్నడ సినిమాలు కూడా ఎక్కువగా చూస్తాను’ అని ఆమె ఓ సందర్భంలో పంచుకున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు