మహేశ్‌.. నమ్రత.. ఓ అపురూప చిత్రం

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు ఆయన సతీమణి నమ్రత నేడు 15వ వివాహ వార్షికోత్సంలోకి అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో మహేశ్‌ నమ్రతతో దిగిన ఓ అపురూప చిత్రాన్ని ట్విటర్‌ వేదికగా షేర్‌ చేస్తూ.. తన సతీమణికి శుభాకాంక్షలు తెలిపారు. ‘హ్యాపీ 15 మై లవ్‌..!! నమ్రత.. ప్రతిరోజూ నీపై ఉన్న ప్రేమ...

Published : 10 Feb 2020 13:28 IST

సూపర్‌స్టార్ కోసం ఆయన సతీమణి ఎమోషనల్‌ పోస్ట్‌

హైదరాబాద్‌: టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు ఆయన సతీమణి నమ్రత నేడు 15వ వివాహ వార్షికోత్సంలోకి అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో మహేశ్‌ నమ్రతతో దిగిన ఓ అపురూప చిత్రాన్ని ట్విటర్‌ వేదికగా షేర్‌ చేస్తూ.. తన సతీమణికి శుభాకాంక్షలు తెలిపారు. ‘హ్యాపీ 15 మై లవ్‌..!! నమ్రత.. ప్రతిరోజూ నీపై ఉన్న ప్రేమ మరింత ఎక్కువవుతోంది’ అని మహేశ్‌ ట్వీట్‌ చేశారు. మరోవైపు నమ్రత సైతం మహేశ్‌ దిగిన ఓ ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘ఏ అమ్మాయి అయినా కలలుకనే పరిపూర్ణమైన, ప్రేమతో నిండిన జీవితాన్ని నువ్వు నాకు అందించావు. మన పిల్లలు.. మన ఇల్లు.. మన కుటుంబం.. అన్నింటికంటే మన మధ్య ఉన్న స్నేహాన్ని నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. హ్యాపీ 15 మహేశ్‌. లవ్‌ యూ ఫర్‌ ఎవర్రీథింగ్‌’ అని తెలిపారు.

‘వంశీ’ సినిమాలో వెండితెరపై కలిసి సందడి చేసిన వీరిద్దరూ.. ఆ సినిమా షూటింగ్‌లోనే స్నేహితులుగా మారారు. ఆ తర్వాత కొంతకాలానికే వీరి స్నేహబంధం.. ప్రేమకు.. ఆపై వివాహానికి దారి తీసిన విషయం తెలిసిందే. వివాహానికి ముందు ఎన్నో బాలీవుడ్‌ సినిమాల్లో నటించిన నమ్రత చివరిగా ‘అంజి’ చిత్రంలో చిరంజీవికి జంటగా కనిపించారు. వివాహం తర్వాత ఆమె నటనకు దూరమయ్యారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని