సెలబ్రిటీలు మెచ్చిన ‘ఆర్గంజా’

దుస్తుల విషయంలో నవతరం ఫాలో అవుతున్న ట్రెండ్‌ చూస్తుంటే ‘ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌’ అనే మాట చక్కగా సెట్‌ అవుతుందని తెలుస్తుంది. ఎందుకంటే ఫ్యాషన్‌ రంగంలో తరాల అంతరాలు చెరిపేస్తూ ఎన్నో కొత్త ఫ్యాషన్లు పుట్టుకొస్తున్నాయి. పాతతరం ఫ్యాషన్లకు కొంగొత్త హంగులు అద్దుకుని మార్కెట్లో నవతరాన్ని ఆకర్షిస్తున్న....

Updated : 11 Feb 2020 10:02 IST

సినీతారలను మెప్పిస్తున్న ఓల్డ్‌ స్టైల్‌

ముంబయి: దుస్తుల విషయంలో నవతరం ఫాలో అవుతున్న ట్రెండ్‌ను చూస్తుంటే ‘ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌’ అనే మాట చక్కగా సెట్‌ అవుతుంది. ఎందుకంటే ఫ్యాషన్‌ రంగంలో తరాల అంతరాలు చెరిపేస్తూ ఎన్నో కొత్త ఫ్యాషన్లు పుట్టుకొస్తున్నాయి. పాతతరం ఫ్యాషన్లకు కొంగొత్త హంగులు అద్దుకుని మార్కెట్లో నవతరాన్ని ఆకర్షిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మార్కెట్లోకి అలాంటి ఎన్నో ఫ్యాషన్లు రాగా వాటిలో కొన్నింటిని మెచ్చుకున్నాం. అయితే ప్రస్తుతం ఫ్యాషన్‌ ప్రియులు, సెలబ్రిటీలు ‘ఆర్గంజా’ వైపు మొగ్గు చూపుతున్నారు. ఎన్నో యేళ్ల క్రితం మహిళల మనసు దోచుకున్న ఈ చీరలు కొంగొత్త అందాలతో నేటితరం సెలబ్రిటీల మదిని దోస్తున్నాయి. 

తాజాగా ‘జాను’ సినిమా సక్సెస్‌ అయిన సందర్భంగా ఆ చిత్రబృందం ఆదివారం థ్యాంక్స్‌ మీట్‌ను నిర్వహించింది. ఈ వేడుకకు సమంత ‘ఆర్గంజా’ చీరలో హాజరై ఎందరో అభిమానుల మదిని దోచారు. స్కీన్‌, పింక్‌ కలర్‌లో ఉన్న చీరపై సమంత ‘జాను’ అని ఆంగ్లంలో ప్రింట్‌ చేయించుకున్నారు. ఆమె చీరను చూసిన ఫ్యాషన్‌ ప్రియులు చాలా బాగుందంటూ కామెంట్లు పెట్టారు. ఇటీవల బాలీవుడ్‌ బెబో కరీనాకపూర్‌ సైతం ‘గుడ్‌న్యూస్‌’ సినిమా ప్రమోషన్స్‌లో లైట్‌ గ్రీన్‌ కలర్‌ ‘ఆర్గంజా’ చీరలో మెరిసిపోయారు. చీరపై ప్రత్యేకంగా ‘బెబో’ అని ప్రింట్‌ చేయించుకున్నారు కరీనా. వీరితోపాటు కత్రినా కైఫ్‌, ప్రియాంకచోప్రా, కంగనా రనౌత్‌, సోనమ్‌ కపూర్‌, దీపికా పదుకొణె, అనుష్క శర్మ.. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎందరో సెలబ్రెటీలు ‘ఆర్గంజా’ చీరలో మెప్పించారు. ‘ఆర్గంజా’ అందాల్లో మెరిసిన సెలబ్రెటీలపై ఓ లుక్కేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని